BRS | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతిని ధి, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ)/ఖైరతాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై దాదాపు ఇప్పటివరకూ వెలువడిన సర్వేలన్నీ బీఆర్ఎస్దే మరోసారి అధికారం అని అంచనా వేశా యి. గులాబీ పార్టీ హ్యాట్రిక్ పక్కా.. అని మ రో రెండు సర్వేలు తేల్చాయి. ఏకంగా 69-77 స్థానాలను కైవసం చేసుకొని మూడోసారి కేసీఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని, ప్రతిపక్షాలు సమీప దూరంలో కూడా నిలవకుండా తెలంగాణ ప్రజానీకం మరోసారి సంచలన తీర్పు ఇవ్వనున్నారని పొలిటికల్ గ్రాఫ్ రిసెర్చ్ సర్వే తేల్చగా.. బీఆర్ఎస్ పక్షాన రా ష్ట్రంలో 48% మంది ప్రజానీకం ఉన్నారని మిషన్ చాణక్య సర్వే స్పష్టం చేసింది.
119 నియోజకవర్గాల్లో సర్వే చేసిన పొలిటికల్ గ్రాఫ్ రిసెర్చ్ బృందం సోమవారం తమ నివేదికను విడుదల చేసింది. సెప్టెంబర్ 25 నుం చి నవంబర్ రెండో తేదీ వరకు నిర్వహించిన ఈ సర్వేలో పలు అంశాలపై ఓటర్ల మనోగతా న్ని తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఏ యే పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఎంత శాతం ఓట్లను కైవసం చేసుకోనున్నారు? అనే అంశాలతో పాటు ఏయే జిల్లాలో ఎన్ని సీట్లు రానున్నాయనేది నివేదికలో స్పష్టం చేశారు.
బీఆర్ఎస్కు తగ్గని ఆదరణ
ఈ సర్వేలో బీఆర్ఎస్కు ఏమాత్రం ఆదరణ తగ్గలేదని స్పష్టమైంది. 119 నియోజకవర్గాల్లో ఏకంగా 40.3% ఓట్లను సొంతం చేసుకోనుందని సర్వేలో తేలింది. రెండో స్థా నంలో నిలిచే కాంగ్రెస్‌కు 31.8% ఓట్లు రానుండగా… బీజేపీకి 16.4% ఓట్లు వస్తాయని పేర్కొంది. మజ్లిస్‌కు 3.2%, కమ్యూనిస్టులకు 2.1% ఓట్లు రానుండగా ఇతరులకు 4.3% ఓట్లు రానున్నాయి.

బంపర్ మెజార్టీ
సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ విజయఢంకా మోగించనుందని సర్వేలో స్ప ష్టమైంది. బీఆర్ఎస్ ఏకంగా 69 నుంచి 77 స్థానాలను కైవసం చేసుకోనుందని నివేదికలో తెలిపారు. రెండో స్థానంలో ఉండే కాంగ్రెస్ పార్టీకి 31 నుంచి 39 స్థానాల వరకు రావచ్చ ని తేల్చారు. బీజేపీ 2 నుంచి ఆరు స్థానాలకు పరిమితం కానుండగా, మజ్లిస్ తన ఏడు స్థానాలను నిలబెట్టుకోనున్నదని తేల్చారు.
అన్ని జిల్లాల్లోనూ అదే జోరు..
ఈ సర్వేలో పాత జిల్లాలవారీగా ఏయే పార్టీకి ఎన్ని స్థానాలు రానున్నాయనే వివరాలను కూడా పేర్కొన్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ అన్ని జిల్లాల్లోనూ తన జోరును కొనసాగించింది. అత్యధికంగా రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో ఆ పార్టీకి పది స్థానాలు రానున్నాయి. కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో 9 చొప్పున, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో 7 చొప్పున గెలుచుకోనున్నది. హైదరాబాద్ జిల్లాలో 7 స్థానాలు మజ్లిస్‌కు పోగా, 6 స్థానాలను గులాబీ పార్టీనే కైవసం చేసుకోనున్నది. నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో మాత్రం కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ కంటే ఎక్కువ స్థానాలు రానున్నట్టు సర్వేలో తేలిం ది. ఇక్కడ కాంగ్రెస్ 7 చొప్పున స్థానాలను కైవసం చేసుకోనుండగా, బీఆర్ఎస్కు నల్లగొండలో 5, ఖమ్మంలో 3 స్థానాలు దక్కనున్నాయి. బీజేపీ కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల్లో ఒక్కో స్థానంతో పాటు హైదరాబాద్‌లో 2 స్థానాలను గెలుచుకోనుందని పేర్కొన్నారు.
ప్రజలకు కేసీఆరే కావాలి : మిషన్ చాణక్య
రాష్ట్ర ప్రజలు ఇప్పటికీ సీఎంగా కేసీఆర్‌నే కోరుకుంటున్నారని, అత్యంత ప్రజాదరణ క లిగిన నాయకుడు ఆయనేనని మరో సర్వే తే ల్చింది. ప్రఖ్యాత సర్వే సంస్థ ‘మిషన్ చాణ క్య’ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకా రం.. రాష్ట్రంలోని 56.41% మంది ప్రజలు సీఎంగా కేసీఆర్ ఉండాలని స్పష్టం చేశారు. కాంగ్రెస్ గెలిస్తే తానే సీఎం అవుతానంటూ రేవంత్‌రెడ్డి చేసుకున్న ప్రచారాలు, బీజేపీ చేసిన బీసీ సీఎం ప్రకటన వంటివి కేసీఆర్ కరిష్మా ముందు తేలిపోయాయని పేర్కొన్నది.
48 శాతం ఓట్లు ఖాయం
బీఆర్ఎస్కు 48% ఓట్లు పడే అవకాశం ఉన్నదని సునీల్ వీర్ అండ్ టీం అంచనా వేసింది. తాము ఈ ఏడాది జూన్ 3వ తేదీ నుంచి ప్రతి జిల్లాకు అభిప్రాయాలను సేకరించామని సభ్యులు తెలిపారు. ఈసారి 79% వరకు పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. మొత్తం పోలయ్యే ఓట్లలో.. బీఆర్ఎస్కు 48%, కాంగ్రెస్‌కు 31%, బీజేపీకి 10% ఓట్లు రావొచ్చన్నారు.
పార్టీలవారీగా సీట్లు…
బీఆర్ఎస్: 73 +/- 4
కాంగ్రెస్: 35 +/- 4
బీజేపీ: 4 +/- 2
మజ్లిస్: 7
మొత్తం: 119
ఓట్ల శాతం పార్టీల వారీగా…
బీఆర్ఎస్: 40.3
కాంగ్రెస్: 31.8
బీజేపీ: 16.4
మజ్లిస్: 3.2
సీపీఐ, సీపీఎం: 2.1
ఇతరులు: 4.3
చెప్పలేం/తెల్వదు: 1.9