Gift a Smile | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఏటా నిర్వహిస్తున్న గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుంది. పేద ఎంబీబీఎస్ విద్యార్థికి ఆర్థిక సాయం అందించేందుకు బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ యూఎస్ సెల్‌కు చెందిన సంతోశ్ రోకండ్ల ముందుకొచ్చి.. రూ.1,40,000 లు అందజేశారు.
మహబూబాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చదువుతున్న పేద ఎంబీబీఎస్ విద్యార్థి సింహాద్రి చదువు కోసం ఆర్థిక సాయం అందించాలని ఇటీవల కేటీఆర్‌ను విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో కేటీఆర్ పిలుపు మేరకు గిఫ్ట్ ఏ స్మైల్ స్ఫూర్తితో బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ యూఎస్ సెల్‌కు చెందిన సంతోశ్ రోకండ్ల ముందుకొచ్చారు. ఇవాళ సంతోశ్ కుటుంబసభ్యులైన రోకండ్ల జ్యోతి ఇవాళ కేటీఆర్‌ను కలిసి, ఆయన చేతుల మీదుగా ఎంబీబీఎస్ విద్యార్థి సింహాద్రికి రూ.1,40,000లు ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా సంతోశ్‌ను కేటీఆర్ అభినందించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS బర్త్‌డేను పురస్కరించుకొని ఏటా నిర్వహిస్తున్న ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమానికి విశేష స్పందన
🎁😊”గిఫ్ట్ ఎ స్మైల్” తో పేద ఎంబీబీఎస్ విద్యార్థికి ఆర్ధిక సాయం
🎁😊ఆర్ధిక సాయం చేయడానికి ముందుకొచ్చిన బీఆర్ఎస్ NRI US సెల్ కు చెందిన… pic.twitter.com/gCiQrpN9RW
— BRS Party (@BRSparty) July 22, 2025