హైదరాబాద్, ఏప్రిల్ 28(నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఐటీ విస్తరణ అద్భుతంగా కొనసాగుతున్నదని బీఆర్ఎస్ ఎన్నారై గ్లోబల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల తెలిపారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ద్వితీయశ్రేణి నగరాల్లో విస్తరణకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నదని చెప్పారు. అమెరికా న్యూజెర్సీలో ఐటీ సర్వ్ అలయన్స్‌లో అమెరికా సెనేటర్ (న్యూజెర్సీ) కోరిబుకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్న కార్యక్రమంలో మహేశ్ బిగాల మాట్లాడారు.
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో, మంత్రి కేటీఆర్ మార్గనిర్దేశకత్వంలో ఐటీ విస్తరణకు చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. ప్లగ్ అండ్ ప్లే మోడ్‌లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం కొనసాగుతున్నదని చెప్పారు. నిజామాబాద్, మహబూబ్‌నగర్, సిద్దిపేట, నల్లగొండ జిల్లాల్లో ఏర్పాటుచేసిన ఐటీ సంస్థలను త్వరలో మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఐటీ సర్వ్ నేషనల్ ప్రెసిడెంట్ విజయ్ మహాజన్, నార్త్ ఈస్ట్ ప్రెసిడెంట్ కళ్యాణ్, ప్రవీణ్ తడకమళ్ల, ప్రవీణ్ ఎండపల్లి, మహీందర్ ముసుకు తదితరులు పాల్గొన్నారు.