హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఇచ్చింది సున్నా అని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర మండిపడ్డారు. మంగళవారం రాజ్యసభలో బడ్జెట్‌పై చర్చలో ఆయన పాల్గొన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఏడోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టినందుకు అభినందనలు తెలిపారు. ఈ బడ్జెట్లో తెలంగాణకు ఏమీ దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశా రు. చంద్రబాబు నాయుడు చొరవతో ఆంధ్రప్రదేశ్‌కు నిధుల వరద పారిందని.. తెలంగాణకు బురద పారిందని ప్రజలు అభిప్రాయపడుతున్నారని చెప్పారు. తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే రాష్ట్రానికి నిధులు తేవడంలో విఫలమయ్యారని ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. ఏపీ, బీహార్‌తో సమానంగా నిధులు రాబట్టలేకపోయినందుకు బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అభివృద్ధికి నిధులు సాధించకపోతే ఇవే మొదటి, చివరి గెలుపుగా మిగులుతుందని హెచ్చరించారు. తమ ఆరాటం, పోరాటం తెలంగాణ సమగ్రాభివృద్ధి కోసమేనని చెప్పారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మార్గనిర్దేశనంలో 10 ఏండ్లలోనే తెలంగాణ గొప్పగా అభివృద్ధి చెంది దేశానికి ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. అభివృద్ధిని మరింత ముందుకు తీసుకువెళ్లేలా నిధులు దురదృష్టకరం అన్నారు.
విభజన హామీలు నెరవేర్చండి
కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని ఎంపీ డిమాండ్ చేశా రు. పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీ య హోదా కల్పించి నిధులు కేటాయించాలని పేర్కొన్నారు. ఐఐఎం, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ నెలకొల్పాలని, 23జిల్లాలకు నవోదయ పాఠశాలలు మంజూరు చేయాలని కోరారు. ఐటీఐఆర్ ప్రాజెక్టుకు ఆమోదం తెలుపాలని, మెగా టెక్స్టైల్ పారు నెలకొల్పాలని కోరారు. సమ్మక-సారలమ్మ గిరిజన యూనివర్సిటీకి మరి న్ని నిధులు కేటాయించాలని, రక్షణ భూము లు ఇచ్చి అభివృద్ధికి సహకరించాలని కోరారు. పీఎం ఆవాస్ యోజనలో 25లక్షల ఇండ్లు ఇ వ్వాలని, మామూనూరు విమానాశ్రయాన్ని ఆధునీకరించాలని, కొత్తగూడెంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉకు కర్మాగారాన్ని నెలకొల్పాలని కోరారు.