KCR | హైదరాబాద్ : ఎర్రవల్లిలో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సోమవారం కలిశారు. రాజ్యసభలో బీఆర్ఎస్ పార్లమెంటరీ డిప్యూటీ లీడర్‌గా తనను ఎంపిక చేసిన నేపథ్యంలో కేసీఆర్‌కు రవిచంద్ర ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
రాజ్యసభలో బీఆర్ఎస్ పార్లమెంటరీ డిప్యూటీ లీడర్‌గా ఎంపీ వద్దిరాజు రవిచంద్రను, విప్‌గా ఎంపీ దీవకొండ దామోదర్‌రావును పార్టీ అధినేత కేసీఆర్ నియమించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయన పార్లమెంట్ సెక్రటరీ జనరల్‌కు లేఖ రాశారు. పార్లమెంటరీ పార్టీనేతగా ఇటీవలే ఎంపీ కేఆర్ సురేశ్‌రెడ్డి నియమితులు కావడం తెలిసిందే. కేసీఆర్ దిశానిర్దేశానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు పార్లమెంట్ వేదికగా తమ శక్తియుక్తులను వినియోగిస్తామని పేర్కొన్నారు.