మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ (Mahabubnagar district) ఉమ్మడి జిల్లాలో ఆదివారం కొనసాగిన స్థానిక పంచాయతీ ( Panchayat Election ) రెండో విడత ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ (BRS) బలపరిచిన అభ్యర్థుల విజయ ఢంకా కొనసాగుతుంది. దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండలం రాజోలి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి అరుణ మన్యంకొండ 61 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

మిడ్జిల్ మండలం భైరంపల్లి సర్పంచ్‌గా బి .గోపాల్ ముదిరాజ్ (బీఆర్ఎస్) విజయం సాధించారు. మిడ్జిల్ మండలం చౌతకుంట తండా సర్పంచ్ గా కె శ్రీలత( బీఆర్ఎస్) విజయ దుంధుబి మ్రోగించారు. నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని ఇబ్రహీంపట్నం గ్రామంలో బీఆర్ఎస్ మద్దతుదారురాలు నాగరాణి విజయం సాధించారు.
తిమ్మాజిపేట మండలం తుమ్మలగుంట తండా గ్రామ పంచాయతీ సర్పంచుగా BRS పార్టీ బలపరిచిన అభ్యర్థి హుస్సేన్ నాయక్ 283 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.