Yashasvi Jaiswal : టెస్టుల్లో పరుగుల వీరుడిగా పేరొందిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal) టీ20ల్లోనూ సెంచరీతో చెలరేగాడు. ఇటీవలే దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌లో శతక్కొట్టిన యశస్వీ.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ(SMAT)లోనూ వందతో విజృంభించాడు. హర్యానా నిర్దేశించిన 235 పరుగుల ఛేదనలో బౌండరీలతో హోరెత్తించిన ఈ లెఫ్ట్ హ్యాండర్ 48 బంతుల్లోనే మూడంకెల్ స్కోర్ అందుకున్నాడు.
టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్న వేళ యశస్వీ జైస్వాల్ శతకాలతో రెచ్చిపోతున్నాడు. వైజాగ్ వన్డేలో సఫారీ బౌలర్లను కాచుకొని.. తొలి సెంచరీ బాదిన ఈ యంగ్‌స్టర్.. ఇప్పుడు పొట్టి ఫార్మాట్లో జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ దంచేశాడు. ప్రత్యర్ధి నిర్దేశించిన 235 పరుగు ఛేదనలో ఈ ముంబై ఓపెనర్ చితక్కొట్టాడు. దొరికిన బంతినల్లా బౌండరీకి పంపిన యశస్వీ.. 16 ఫోర్లు, ఒక సిక్సర్‌తో సెంచరీ బాదేసి జట్టు విజయంలో కీలకమయ్యాడు. ఈ లెఫ్ట్ హ్యాండర్‌కు తోడు సర్ఫరాజ్ ఖాన్ (64) అర్ధ శతకం కొట్టగా 17.3 ఓవర్లలోనే ముంబై లక్ష్యాన్ని అందుకుంది.
Yashasvi Jaiswal brings up his second century in eight days and claims consecutive Player of the Match awards. 👏
His golden run in white-ball cricket rolls on. 💯#YashasviJaiswal pic.twitter.com/bfh9IsXQvy— CricTracker (@Cricketracker) December 14, 2025
సుదీర్ఘ ఫార్మాట్లో ఓపెనర్‌గా స్థిరపడిన యశస్వీకి పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రం అవకాశాలు రావట్లేదు. శుభ్‌మన్ గిల్ (Shubman Gill) గాయపడడంతో వన్డేల్లో ఓపెనింగ్ చేసిన ఈ ముంబై కుర్రాడు తొలి రెండు వన్డేల్లో విఫలమయ్యాడు. చివరి మ్యాచ్‌లో అజేయ శతకంతో టీమిండియా సిరీస్ గెలుపులో కీలక పాత్ర పోషించాడీ చిచ్చరపిడుగు.