MLC Vanidevi | కొండాపూర్, నవంబర్ 2 : విద్యార్థుల సృజనను వెలికితీసేలా చిత్ర ప్రదర్శనలోని చిత్రాలున్నాయని సురభి ఎడ్యుకేషనల్ చైర్మెన్, ఎమ్మెల్సీ వాణిదేవి అన్నారు. సురభి ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మెన్ దివంగత సురభి దయాకరరావు 82వ జయంతిని పురస్కరించుకుని మాదాపూర్లోని వెంకటేశ్వర ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన చిత్రకళ, ఫోటోగ్రఫీ, ఆప్లైడ్ ఆర్ట్స్ విభాగాల విద్యార్థుల చిత్రప్రదర్శనలను ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి దయాకరరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ… విద్యార్థులు వేసిన చిత్రాలు, ఫోటోగ్రఫీలు అద్భుతంగా ఉన్నాయని, భవిష్యత్తులో ఫైన్ ఆర్ట్స్ రంగంలో మెరుగైన అవకాశాలుంటాయన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అజిత సురభి, అధ్యాపకులు, విద్యార్థులు, కళాభిమానులు పాల్గొన్నారు.
