ఖమ్మం, ఏప్రిల్ 18: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంట్రాక్టరుగా అవతారమెత్తిన రోజు నుంచి ఇప్పటి వరకు ఆయన చేసిన భూదందాలు, ఆర్థిక నేరాలు అన్నీ ఇన్నీ కావ ని, వాటిపై సీబీసీఐడీతో విచారణ చేయించాలని సీఎం కేసీఆర్‌ను కోరతానని ఎమ్మెల్సీ, బీ ఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు అన్నారు. సీఎం కేసీఆర్‌ను కొనే వ్యక్తి ఏ జన్మలోనూ ఉండరని స్పష్టం చేశారు. పొంగులేటి గురువు వైఎస్ఆర్ కూడా టీఆర్ఎస్ను చీల్చడానికి ప్రయత్నించి విఫలమయ్యారని చెప్పారు. ఖమ్మంలోని తెలంగాణ భవన్లో మంగళవారం ఆయన మీడియా స మావేశంలో మాట్లాడుతూ..పొంగులేటి స్వార్థ ప్రయోజనాల కోసం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌కే కమీషన్లు ఇచ్చానం టూ చెప్పడం బూటకమని విమర్శించారు. చీ మలపాడు ఘటనను రాజీకీయం చేయడం తగదని ఎమ్మెల్సీ మధు హెచ్చరించారు. తన కూతురి వివాహానికి సీఎం కేసీఆర్‌ని ఆహ్వానించడానికి ప్రగతిభవన్‌కు వెళ్తే కనీసం వివా హ పత్రికను కూడా తీసుకోలేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పడం తన స్థాయికి తగునా అని ప్రశ్నించారు. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేసిన ఫొ టోను, శ్రీనివాసరెడ్డి ఇంట్లో వివాహ వేడుక కు మంత్రి కేటీఆర్ హాజరైన ఫొటోలను ఎ మ్మెల్సీ మధు మీడియా సమావేశంలో చూ పించారు. శ్రీనివాసరెడ్డి చేస్తున్న తప్పుడు ఆ రోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పా రు. పొంగులేటి.. సీతారామ ప్రాజెక్టుకు టెం డర్ ఎందుకు వేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.