MLC Pochampally | హైదరాబాద్ : ప్రజల తరఫున ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను అక్రమ కేసులతో కట్టడి చేయాలని చూడడం మూర్ఖత్వమే అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్, బీజేపీలు కలిసి కేటీఆర్‌పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా మరోసారి ప్రజల దృష్టిని మళ్లించే యత్నం ఇది అని ఆయన పేర్కొన్నారు. ఫార్ములా ఈ రేసుతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన కేటీఆర్‌పై బురద జల్లేందుకు చేస్తున్న కుటిల ప్రయోగం స్పష్టంగా కనిపిస్తుంది. మీ అక్రమ కేసులకు బీఆర్ఎస్ భయపడదు. న్యాయపరంగా, చట్టపరంగా ఎదుర్కుంటాం అని పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.