లగచర్ల గిరిజన రైతులపై సర్కారు దమనకాండను బీఆర్ఎస్ ఎండగట్టింది. రైతులకు బేడీలు వేయడాన్ని నిరసిస్తూ శాసనమండలిలో సభ్యులు ఆందోళనకు దిగారు. నల్లఅంగీలు ధరించి, ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలతో హోరెత్తించారు. లగచర్ల అంశంపై చర్చ జరుపాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పట్టుబట్టడంతో అధికార పక్షం ఉక్కిరిబిక్కిరైంది.
చర్చకు చైర్మన్ తిరస్కరించడంతో పరిస్థితి అదుపుతప్పింది. చివరికి లఘు చర్చ సాగకుండానే మండలి బుధవారానికి వాయిదా పడింది. ఆ తర్వాత చైర్మన్ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ ఆందోళన కొనసాగింది.