MLC Kavitha | హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ నెల 16 నుంచి 23 వరకు అమెరికాలో పర్యటించనున్నారు. తమ కుమారుడు ఆదిత్య గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో పాల్గొనడానికి ఎమ్మెల్సీ కవిత – అనిల్ దంపతులు ఈ నెల 16వ తేదీన అమెరికాకు బయలుదేరనున్నారు. ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత ఈ నెల 23వ తేదీన తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. అయితే, ఈ విదేశీ పర్యటనకు ఢిల్లీలోని రౌజ్ ఎవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టు అనుమతిస్తూ శనివారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.