MLC Kavitha | హైదరాబాద్ : కార్మికులు పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానం రద్దు చేయాలనే కుట్రలను తిప్పికొడుదాం అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా తెచ్చిన కొత్త లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరుతూ కార్మిక సంఘాలు ఈ రోజు (బుధవారం) పిలుపునిచ్చిన దేశవ్యాప్త సార్వత్రిక కార్మిక సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం అని కవిత స్పష్టం చేశారు. కార్మికుల హక్కులను కాలరాసే కొత్త కార్మిక చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అని కవిత పేర్కొన్నారు.