MLC Kavitha | హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల నేపథ్యంలో శేరిలింగంపల్లి నుండి వరంగల్ ఎల్కతుర్తికి 25 అంబాసిడర్ కార్లు బయల్దేరాయి. ఈ అంబాసిడర్ కార్ల శ్రేణిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమం బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్సీ కవిత నివాసంలో జరిగింది.
బిఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా, వినూత్నంగా 25 అంబాసిడర్ కార్లను గులాబీ రంగుతో ఆకర్షణీయంగా ఏర్పాటు చేసిన శేరిలింగంపల్లికి చెందిన బీఆర్ఎస్ నాయకులు రవి యాదవ్‌ను ఎమ్మెల్సీ కవిత అభినందించారు. బీఆర్ఎస్ పార్టీ గుర్తు అయినటువంటి అంబాసిడర్ కారును గులాబీమయం చేసి.. 25 కార్లతో ఎల్కతుర్తి సభా ప్రాంగణానికి బయలుదేరిన రవి యాదవ్‌కు కవిత శుభాకాంక్షలు తెలియజేశారు. కేసీఆర్ మీద, బీఆర్ఎస్ పార్టీ మీద రవి యాదవ్ చూపిస్తున్న ప్రేమ, ప్రజల ఆదరణ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని కవిత పేర్కొన్నారు.
పటాన్ చెరు నియోజకవర్గం నుండి హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో జరగబోయే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు సిద్ధమైన గులాబీ రంగు కార్లను జెండా ఊపి ప్రారంభించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish #25YearsOfBRS#BRSat25 pic.twitter.com/xDAADcM5A0
— BRS Party (@BRSparty) April 26, 2025