కమిటీలతో కాలయాపన వద్దు
‘ఉద్యమకారుల గుర్తింపును ప్రహసనంగా మార్చొద్దు. కమిటీల పేరిట కాలయాపన చేయొద్దు. కమిటీకి బదులు చట్టబద్ధమైన అధికారాలు కలిగిన డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలి’ అని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
- ఉద్యమకారులకిచ్చిన హామీలను నెరవేర్చాలి
- 25 వేల పింఛన్, 250 గజాల స్థలం ఇవ్వాలి
- ఎమ్మెల్సీ దాసోజు, మాజీ ఎమ్మెల్సీ కర్నె
హైదరాబాద్, జూన్ 4 (నమస్తేతెలంగాణ): ‘ఉద్యమకారుల గుర్తింపును ప్రహసనంగా మార్చొద్దు. కమిటీల పేరిట కాలయాపన చేయొద్దు. కమిటీకి బదులు చట్టబద్ధమైన అధికారాలు కలిగిన డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలి’ అని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రత్యేకరాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన కుటుంబాలకు, ఉద్యమకారులకు న్యాయం చేయాల్సిన బాధ్యత సర్కార్‌పై ఉన్నదని స్పష్టంచేశారు.
కేసీఆర్ హయాంలో 610 మంది అమరుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఇచ్చారని, ఇంటికో ఉద్యోగం ఇచ్చి ఆదుకొన్నారని, 582 మంది కళాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలిచ్చారని గుర్తుచేశారు. సచివాలయంలో కేశవరావు నేతృత్వంలో ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సర్వసభ్య సమావేశానికి హాజరై వారు వాదనలు వినిపించారు. అనంతరం తెలంగాణ భవన్లో వారు మీడియాతో మాట్లాడారు. సచివాలయంలోకి సామాన్య ఉద్యమకారులు పోవడం కష్టమని, అందుకే అమరవీరుల స్తూపంలోనే ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
మ్యానిఫెస్టో హామీలు అమలు చేయాలి
కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు అమరుల కుటుంబాలకు ప్రతినెలా రూ.25 వేల పింఛన్ ఇవ్వాలని, 250 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని దాసోజు శ్రవణ్, కర్నె ప్రభాకర్ డిమాండ్ చేశారు. కానీ గుర్తింపు కమిటీ సిఫార్సులనే పరిగణనలోకి తీసుకుంటామని చెప్పి హామీలను ఎగ్గొడితే ఊరుకొనేదిలేదని హెచ్చరించారు. రెండున్నరేండ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 679 జారీచేసి అమరుల కుటుంబాలకు న్యాయం చేస్తామని చెప్పడం శోచనీయమని పేర్కొన్నారు.
కేసీఆర్ సీఎం అయిన వెంటనే తొలి బడ్జెట్లోనే రూ.100 కోట్లు కేటాయించిన విషయాన్ని ప్రస్తావించారు. కానీ, ప్రస్తుత రేవంత్ సర్కార్ నయాపైసా కేటాయించకపోవడంతో ఆయన చిత్తశుద్ధిపై అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు. ఓట్లు కొల్లగొట్టేందుకు నాటకాలాడితే ఊరుకొనే ప్రసక్తిలేదని హెచ్చరించారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు వై సతీశ్‌రెడ్డి, కిశోర్‌గౌడ్, రాఘవేంద్ర, విద్యాసాగర్, అంజన్‌రావు, రవినాయక్, శీనునాయక్ పాల్గొన్నారు.
బీఆర్ఎస్ ప్రతిపాదనలు ఇవే..
- ఉద్యమకారుల గుర్తింపు కమిటీని వెల్ఫేర్ కమిషన్ల మాదిరిగా డెడికేటెడ్ కమిషన్‌గా మార్చి ప్రత్యేక కార్యదర్శిని నియమించాలి. ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి.
- సాధారణ ఉద్యమకారులు సచివాలయంలోకి వెళ్లడం కష్టం. అందుకే కేసీఆర్ అమర జ్యోతిలోనే కార్యాలయం ఏర్పాటుచేయాలి.
- ఉద్యమకారులను తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధులుగా గుర్తించాలి. అధికారిక కార్యక్రమాల్లో సముచిత గౌరవం ఇవ్వాలి.
- పార్టీలతో పాటు సబ్బండ జనులతో సంప్రదింపులు జరుపాలి. జేఏసీలు, ప్రజాసంఘాలు, జర్నలిస్టులను భాగస్వాములను చేయాలి.
- 2010లో కేయూలో పోలీసుల హింసకు గురైన యాకూబ్‌రెడ్డికి పరిహారం అందించాలి. ఇతర ఉద్యమకారులను గుర్తించాలి.
- తెలంగాణ తల్లి రూపురేఖలను మార్చవద్దు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ప్రాంగణానికి తాళాలు వేయవద్దు. తెలంగాణ ఉద్యమ వాస్తవ చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

