హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ ప్రజల అంచనాలు, అవసరా లు, ఆలోచనలకు పూర్తిగా భిన్నంగా ఉన్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శించారు. శాసనమండలిలో బడ్జెట్‌పై జరిగిన చర్చలో మంగళవారం ఆయన మాట్లాడు తూ.. బడ్జెట్ అంచనాలు, వాస్తవ ఖర్చుల మధ్య భారీ వ్యత్యాసాలు ఉండటం వల్ల బడ్జెట్‌పై ప్రజల్లోనే కాకుండా ప్రభుత్వ యంత్రాంగంలో కూడా విశ్వాసం దెబ్బతింటుందని పే రొన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2.2 లక్షల కోట్ల బడ్జెట్ అంచనాలు పెట్ట గా వాస్తవంగా రూ.1.67 లక్షల కోట్లే ఖర్చయిందని తెలిపారు. 2025-26లో 2.29 లక్షల కోట్ల అంచనాలు పెట్టి, ఇప్పటివరకు కేవలం రూ.2.03 లక్షల కోట్లే ఖర్చు చేశారని వివరించారు. ఇప్పుడు రూ.2.41 లక్షల కోట్ల భారీ అంచనాలు పెట్టడం అసంబద్ధమని విమర్శించారు. బడ్జెట్ అంచనాలు వాస్తవానికి దగ్గరగా ఉండాలని, సాధారణంగా 5 నుంచి 10% వరకు మాత్రమే వ్యత్యాసం ఉండాలని పేరొన్నారు.
ప్రభుత్వం మాత్రం ప్రతిసారీ భారీ అంచనాలు చూపించి చివరికి తకువ ఖర్చు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నదని విమర్శించారు. సీఏజీ నివేదిక ప్రకారం 2025-26 సంవత్సరానికి ప్రభు త్వం రూ.2.29 లక్షల కోట్ల రెవెన్యూ రిసిప్ట్స్ అంచనా వేసిందని, అయితే 2026 జనవరి చివరి వరకు రూ.1.38 లక్షల కోట్లే వచ్చాయని తెలిపారు. అంటే లక్ష్యంలో 60% మాత్రమే సాధ్యమైందని చెప్పారు. ప్రభు త్వం అప్పుల విషయంలో కూడా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నదని ఆరోపించారు. మూ డేండ్లలో రూ.3.47 లక్షల కోట్ల అప్పులు తీసుకుని, అందులో రూ.3.3 లక్షల కోట్లు పాత అప్పుల చెల్లింపులకు ఉపయోగించామని సీఎం చెప్పడం వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నదని, ప్రభుత్వం నేరుగా చెల్లించిన అప్పులు 1.67 లక్షల కోట్లు మాత్రమే ఉన్నాయని వివరించారు. విద్యారంగంపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతున్నదని, ప్రైవేట్ సూళ్లు, కాలేజీల ఫీజు దోపిడీని నియంత్రించే అంశంపై బడ్జెట్ లో ఒకమాట కూడా లేదని మండిపడ్డారు.