Dasoju Sravan | హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు వర్గీయుల నుంచి వస్తున్న బెదిరింపులపై ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్న నేపథ్యంలో మండలిలో ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ మధుసూదనాచారి చారి నేతృత్వంలో సైబరాబాద్ పోలీసు కమిషనర్‌కు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భఃగా ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. సీఎంను కాకపోతే నేను రౌడీ అయ్యేవాడ్ని అని స్వయంగా రేవంత్ రెడ్డి అన్నారు. సీఎం స్థాయిలో ఉండి ఇలాంటి మాటలేనా మాట్లాడేది..? గతంలో ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం గూండాల, రౌడీల రాజ్యం నడుస్తుందన్నారు. మైనంపల్లి హన్మంతరావు, ఆయన కుమారుడు రోహిత్ దుర్మార్గమైన రౌడీయిజానికి పాల్పడుతున్నారు అని దాసోజు శ్రవణ్ కుమార్ మండిపడ్డారు.
శంభీపూర్ రాజు తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తి. ఆయన గుండె గట్టిది. ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకొండి. ఇష్టానుసారంగా బెదిరిస్తున్నారు, చంపుతామని తన అనుచరులకు తాగించి బెదిస్తున్నారు. తెలంగాణలో దాడులు, గంజాయి పెరిగిపోతుంది. హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలు క్షీణించాయని దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు.