BRS MLAs | లగచర్ల ఫార్మా బాధిత రైతులకు రేవంత్ సర్కార్ బేడీలు వేయడంపై బీఆర్ఎస్ శాసనసభ్యుల నిరసన కొనసాగుతున్నది. మంగళవారం అసెంబ్లీకి నల్లఅంగీలు ధరించి వచ్చిన ఎమ్మెల్యేలు చేతులకు బేడీలతో నిరసనకు దిగారు. ప్రభుత్వ దమననీతికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
శాసనసభలో లగచర్ల ఘటనపై చర్చను చేపట్టాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్, ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, సుధీర్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, సంజయ్, అనిల్ జాదవ్ తదితరులు నిరసనలో పాల్గొన్నారు.