BRS | ఎమ్మెల్సీలు చేపట్టిన ఆందోళనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జాబ్ క్యాలెండర్ పేరిట నిరుద్యోగులను అసెంబ్లీ సాక్షిగా మోసం చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. ఈ క్రమంలో పోలీసులు, కేటీఆర్ మధ్య వాగ్వాదం నెలకొంది. అమరవీరుల స్తూపం వద్ద నిరసన తెలిపే హక్కు లేదా.. ఇదేనా ప్రజాపాలన అని ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోలీసులను ప్రశ్నించారు. వాళ్ల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వారిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. వారిని బస్సులో తరలించారు. కాగా బస్సులోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ ఆందోళన కొనసాగించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రెండు లక్షల ఉద్యోగాలిస్తామని ఆయన చెప్పారని.. రెండు ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని అన్నారు. రాహుల్ గాంధీ తెలంగాణకు రావాలని.. తెలంగాణ యువతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తప్పకుండా రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చేదాకా కాంగ్రెస్ ప్రభుత్వం వెనుక బీఆర్ఎస్ పడుతుందని చెప్పారు. నిరుద్యోగులకు న్యాయం జరిగేదాకా తప్పకుండా వారికి అండగా ఉంటామని స్పష్టం చేశారు.
2 లక్షల ఉద్యోగాల పేరిట తెలంగాణ యువతను మోసం చేసిన రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణ చెప్పాలి.
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS pic.twitter.com/FjfRyefAbG
— BRS Party (@BRSparty) August 2, 2024
నిరుద్యోగుల కోసం గన్ పార్క్ వద్ద ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అక్రమంగా అరెస్టు చేసిన పోలీసులు.@KTRBRS @BRSHarish pic.twitter.com/t7cyGIDytk
— BRS Party (@BRSparty) August 2, 2024