హైదరాబాద్, ఫిబ్రవరి 15(నమస్తే తెలంగాణ): విమర్శలు వెల్లువెత్తుతున్నా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీరుమాత్రం మారడం లేదు. గురువారం అసెంబ్లీలో మరోమారు మాజీ మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పరుష వ్యాఖ్యలు చేశారు.
కోమటిరెడ్డి తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేచి నిరసన తెలపగా, మరింతగా రెచ్చిపోయిన ఆయన కేటీఆర్‌ను ఉద్దేశిస్తూ ‘ఏయ్ ఆగవయా ఆగు’ అంటూ పలుమార్లు బెదిరించే ధోరణిలో మాట్లాడారు. సభలోనే మంత్రి బెదిరిస్తు న్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు.