కరీంనగర్, జూలై 25 (నమస్తే తెలంగాణ): రాజకీయ ప్రయోజనాల కోసం రైతుల జీవితాలతో చెలగాటం ఆడొద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ సర్కార్‌కు సూచించారు. రాజకీయాలు, కక్షసాధింపు చర్యలకుపోతే రైతులు, ప్రజలు నష్టపోతారని అన్నారు. తక్షణమే ప్రభుత్వం కాళేశ్వరం నుంచి నీటిని పంపింగ్ చేసి రాష్ట్రంలోని రిజర్వాయర్లను నింపాలని డిమాండ్ చేశారు. గురువారం సాయం త్రం కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల బృందం తో కలిసి కేటీఆర్ ఎల్ఎండీ రిజర్వాయర్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక నీటిపారుదల శాఖ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎల్ఎండీ రిజర్వాయర్‌లో గతేడా ది ఇదే సమయానికి ఎంత నీరు ఉన్నది? ఇప్పు డు ఎంత ఉన్నదని తెలుసుకున్నారు. మొదట క్రికెట్ మైదానాన్ని తలపిస్తున్న రిజర్వాయర్‌ను, కాకతీయ దిగువ కాలువ వద్ద ఉన్న హెడ్ రెగ్యులేటర్ వద్ద నీటి మట్టాన్ని, గేట్ల వద్దకు వెళ్లి అక్క డి నీటి మట్టాన్ని పరిశీలించారు.

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి కొద్దిసేపు అక్కడి కార్యాలయంలో అధికారులతో మాట్లాడారు. కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర సాగునీటి రంగంలో విప్లవాన్ని సృష్టించారని తెలిపారు. ముఖ్యంగా గోదావరి నదిలో వృథాగా పోతున్న వందల టీఎంసీల నీ టిని ఒడిసిపట్టి తెలంగాణలోని బీడు భూములకు మళ్లించాలనే అద్భుతమైన ఆలోచన చేసి ఆచరణలో చూపారని అన్నారు. మేడిగడ్డ నుం చి మొదలు పెడితే అన్నారం, సుందిళ్ల బరాజ్‌లతో సహా 19 బరాజ్‌లు, రిజర్వాయర్లు, పంప్‌హౌస్‌లు, వందల కిలోమీటర్ల గ్రావిటీ కాలువ లు, వేల కిలోమీటర్ల పిల్ల కాలువలు తవ్వించారని, మొత్తంగా చూస్తే ప్రపంచంలోనే అతి పెద్దదైన మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు రూపంలో కాళేశ్వరాన్ని నిర్మించారని గుర్తుచేశారు.
దురదృష్టవశాత్తు మేడిగడ్డలో జరిగిన ఒక చిన్న ఘటనను పట్టుకొని, దానిని భూతద్దంలో చూపించి మొత్తం కాళేశ్వరాన్ని ఒక విఫల ప్రాజెక్టుగా చూ పే ప్రయత్నంలో సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నారని, గత 8 నెలలుగా లక్షలాది మంది రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ధ్వజమెత్తారు. గతేడాది సరిగ్గా ఇదే రోజు ఎల్ఎండీ రిజర్వాయర్‌లో 12 టీఎంసీలకుపైగా నీరు ఉండేదని, ఇదే సమయంలో కాళేశ్వరం నుంచి సమయానికి పంపింగ్ చేయడం వల్ల పూర్తిస్థాయి నీటిని నిలి పి రైతుల గుండెల్లో భరోసా ఇవ్వగలిగామని చె ప్పారు. కానీ, ఈ ఏడాది పరిస్థితి గురించి అధికారులతో మాట్లాడితే.. ఇప్పటివరకు 45 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని, సెప్టెంబర్ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉన్నా గ్యారంటీ లేకుండా పోయిందని చెప్పినట్టు తెలిపారు.
ఇప్పుడు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గోదావరిలో వరద ఉన్నప్పుడు నీటిని పంపింగ్ చేయా ల్సి ఉన్నదని, అయితే పంపింగ్‌పై నీటి పారుదల శాఖకు ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు రాలేదని అన్నారు. ఒక పక్క గోదావరిలో లక్షల క్యూసెక్కుల నీళ్లు కిందికి పోతున్నాయని, మరో పక్క ప్రభుత్వం పంపింగ్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా చోద్యం చూస్తున్నదని మండిపడ్డారు. అందుకే తమ పా ర్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరిందని తెలిపారు. ఒక పక్క అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పటికీ ఎండిపోతున్న ఎల్ఎండీ, దానిపైన ఉన్న మిడ్‌మానేరు, ఆ పైన ఉన్న ఎస్సారెస్పీ, వరద కాలువపై ఉన్న వేలాది మోటర్లను పరిశీలించేందుకు, వాస్తవాలను వివరించి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే తాము ప్రాజెక్టుల సందర్శనకు వచ్చినట్టు తెలిపారు. రంగనాయకసాగర్, కొండపోచమ్మ సాగర్, అన్నపూర్ణ రిజర్వాయర్ నింపితే రైతులకు ఒక భరోసా ఇచ్చినట్లవుతుందని అన్నారు.
సాగునీటి విషయంలో రైతులకు పూర్తి స్థాయి స్పష్టత వస్తుందనే ఉద్దేశంతో తాము కాళేశ్వరం సిస్టంలోని రిజర్వాయర్లు, పంప్‌హౌస్‌ల సందర్శనకు బయలు దేరామని, ఇక్కడి వాస్తవాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని స్పష్టంచేశారు. కన్నెపల్లి వద్ద పంపింగ్ ప్రా రంభిస్తే కాళేశ్వరం పరిధిలోకి వచ్చే అన్ని రిజర్వాయర్లు నిండే అవకాశం ఉన్నదన్నారు. మల్లన్నసాగర్లో 50 టీఎంసీలు, కొండపోచమ్మ సా గర్‌లో 15 టీఎంసీలు నింపితే కేవలం రైతులకే కాకుండా హైదరాబాద్ మహానగరానికి మంచి నీటి అవసరాలు కూడా తీరుతాయని, మార్గమధ్యంలో ఉండే వేలాది గ్రామాలకు ఇతర జిల్లా లు, నియోజకవర్గాలకు కూడా మంచినీటికి ఇ బ్బందులు లేకుండా సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంటుందని కేటీఆర్ సూచించారు.

మేడిగడ్డ మేడిపండు అయిపోయిందని, అది గోదావరి నీటిలో కొట్టుకుపోతుందని, లక్షల కో ట్లు వృథా అయ్యాయని కాంగ్రెస్ నాయకులు, ప్రభుత్వ పెద్దలు చేసిన ప్రచారమంతా ఉత్తదేనని తేలిపోయిందని కేటీఆర్ అన్నారు. దాదాపు 10 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహాన్ని తట్టుకుని మేడిగడ్డ ఠీవీగా నిలబడి ఉన్నదని అన్నా రు. గురువారం ఎల్ఎండీకి వచ్చినట్టుగానే అవసరమైతే అన్ని రిజర్వాయర్లకు వెళ్లి వాస్తవ పరిస్థితులు పరిశీలిస్తామని అన్నారు. శుక్రవారం ఉదయం కన్నెపల్లి పంప్‌హౌస్‌కు వెళ్తున్నామని, అదే విధంగా మేడిగడ్డ బరాజ్, కాళేశ్వర ఆలయాన్ని కూడా సందర్శిస్తామని చెప్పారు.
ఎమ్మెల్యేల బృందంలో గంగుల కమలాకర్, జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, సీహెచ్ మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి, మాగంటి గోపీనాథ్, విజయుడు, ఎ మ్మెల్సీలు గోరటి వెంకన్న, తాతా మధు, శంభీపూర్ రాజు, శేరి సుభాష్‌రెడ్డి, ఎంసీ కోటిరెడ్డి, మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఎల్ఎండీ వద్ద మాజీ ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, బాల్క సుమన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వీర్ల వెంకటేశ్వర్రావు, మేయర్ వై సునీల్‌రావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, నాయకులు చల్మెడ లక్ష్మీనరసింహారావు, పొన్నం అనిల్‌గౌడ్, ఏనుగు రవీందర్‌రెడ్డి తదితరులు కేటీఆర్ బృందానికి స్వాగతం పలికారు.