LPG Gas Crisis | రాష్ట్రంలో నెలకొన్న గ్యాస్ కొరతపై బీఆర్ఎస్ సభ్యులు నిరసన తెలిపారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ముందుగా గన్‌పార్క్ వద్దకు చేరుకున్న బీఆర్ఎస్ సభ్యులు గ్యాస్ సిలిండర్ల ప్లకార్డులతో నిరసన తెలిపారు. పెరిగిన ధరలపై ఆందోళన వ్యక్తం చేశారు. అవే ప్లకార్డులతో అసెంబ్లీకి బయల్దేరి వెళ్లారు.
గ్యాస్ కొరత లేదని చెబుతూనే హోటళ్లు, చిరు వ్యాపారులకు వాణిజ్య సిలిండర్ల సరఫరాను నిలిపివేయడంపై బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. గ్యాస్ కొరత కారణంగా సాధారణ ప్రజానీకంతో పాటు చిరు వ్యాపారులు, హోటల్ వ్యాపారంపై ఆధారపడిన లక్షలాది మంది ఉపాధికి తీవ్ర విఘాతం కలిగిందని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి గ్యాస్ సరఫరా సంక్షోభంపై ప్రజలకు నిజాలు చెప్పాలని డిమాండ్ చేశారు.