Vemula Prashanth Reddy | వేల్పూర్ : నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలో బుధవారం మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ బాకీ కార్డ్ పంపిణీ చేశారు. వేల్పూరు డబుల్ బెడ్రూం కాలనీలో ఇంటింటికి తిరుగుతూ బాకీ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదని విమర్శించారు. స్థానిక ఎన్నికల్లో ఓట్లు అడగటానికి వచ్చే నాయకులను నిలదీయాలని పిలుపునిచ్చారు. హామీ ఇచిన అన్ని పథకాలను అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.