T Harish Rao | హైదరాబాద్‌లోని చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో చదువుకుంటున్న విద్యార్థులపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడటాన్ని బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే టీ హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. గ్రూప్స్, డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులపై ప్రభుత్వం ఇంత పాశవికంగా ప్రవర్తించడం దుర్మార్గం అని సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. `ఇదేనా ప్రజా పాలన అంటే, ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే?` అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హరీశ్ రావు నిలదీశారు.
నాడు అసెంబ్లీ ఎన్నికల ముంగిట చిక్కడపల్లిలోని సిటీ సెంట్రల్ లైబ్రరీకి రాహుల్ గాంధీని తీసుకువెళ్లి ఓట్లు కొల్లగొట్టిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అదే లైబ్రరీకి పోలీసులను పంపి విద్యార్థుల వీపులు పగులగొడుతున్నారని హరీశ్ రావు మండి పడ్డారు. విద్యార్థులపై జరుగుతున్న దమనకాండను ప్రభుత్వం వెంటనే ఆపాలని స్పష్టం చేశారు. ఈ ఘటనకు బాధ్యత వహించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Kia EV6 | 1138 ఈవీ6 కార్లను రీకాల్ చేస్తున్న కియా.. కారణమిదేనా..?!
Signal Jump | సిగ్నల్ జంప్ చేసినా నో ప్రాబ్లం.. అందుకైతే నో ‘ఫై’.. ఎక్కడో తెలుసా..?!
Mahindra Scorpio | ఈ త్రీ రో ఎస్యూవీ కారుపైనే మోజు.. మహీంద్రా ఎక్స్‌యూవీ700 కూడా తర్వాతే..
Tata Punch Facelift | ఏడాది చివర్లో భారత్ మార్కెట్లోకి టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్.. !