MLA Sabitha | హైదరాబాద్ : ఓబుళాపురం మైనింగ్ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు తుది తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. 15 ఏండ్ల పాటు సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసులో మొత్తం ఐదుగురిని దోషులుగా, ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో అప్పటి గనుల శాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డికి ఉపశమనం లభించింది.
ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. 12 ఏండ్లుగా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. ఈ కేసులో అపవాదు మోస్తూ వచ్చాను. నాపై వచ్చిన అపవాదులకు ఎంతో బాధపడ్డాను. ఎన్ని అపవాదులు వచ్చినా నా నియోజకవర్గ ప్రజలు అండగా నిలిచారు. న్యాయం తప్పకుండా జరుగుతుందని ఈ తీర్పు ద్వారా రుజువైంది. ఏ తప్పు చేయకపోయినా కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. న్యాయ వ్యస్థను నమ్మాను.. నాకు న్యాయం జరిగింది. ఈ రోజు న్యాయ వ్యస్థపై సంపూర్ణమైన నమ్మకం కలిగిందని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. న్యాయవవస్థకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు సబిత ప్రకటించారు.