బాన్సువాడ, ఫిబ్రవరి 7: ముఖ్యమంత్రి హోదాలో ఉండి దిగజారుడు మాటలు మా ట్లాడటం సరికాదని రేవంత్‌రెడ్డికి మాజీ స్పీ కర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి హితవు పలికారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను పట్టుకుని సీఎం రేవంత్‌రెడ్డి నోటికొచ్చినట్టు దుర్భాషలాడటం ఏమిటని ప్రశ్నించారు. సీఎం పదవిలో హూందాగా వ్యవహరించాలని సూచించారు.
ప్రతిపక్షాల మీద కా కుండా ప్రజలకు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టాలని సూచించారు. కాంగ్రెస్ 420 హామీలను అమలు చేయాలని, లేకపోతే ప్రజల తరఫున బీఆర్ఎస్ పోరాడుతుందని తెలిపారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్‌లో బుధవారం నిర్వహించిన బీఆర్ఎస్ బాన్సువాడ నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో పోచారం మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో 1.8 శాతం ఓట్ల తేడాతోనే అధికారం కోల్పోయామని, 14 స్థానాల్లో స్వల్ప మెజార్టీతో ఓడిపోయినట్టు తెలిపారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భా స్కర్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.