KTR | హైదరాబాద్ : బీసీ వర్గాల పట్ల డిక్లరేషన్ ఒక్కటే సరిపోదు డెడికేషన్ కూడా ఉండాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ చురకలంటించారు. పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా కేటీఆర్ శాసనసభలో ప్రసంగించారు.
డిక్లరేషన్ ఒక్కటే సరిపోదు డెడికేషన్ కూడా ఉండాలి. అప్పుడే ప్రజలు హర్షిస్తారు. మీరు హౌస్ హోల్డ్ సర్వే చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు పాల్గొనలేదని అంటున్నారు. ముగ్గురం ఎన్నికల అఫిడవిట్లు ఇచ్చాం.. నేను ఓసీనా, బీసీనా అనేది మీ అందరికీ తెలుసు. నేను పాల్గొంటే ఏంటి..? పాల్గొనకపోతే ఏంటి..? తప్పు చేసింది మీరు అని కేటీఆర్ మండిపడ్డారు.
కేసీఆర్ ప్రభుత్వం చేసినప్పుడు 52 శాతం బలహీన వర్గాలు ఉంటే.. కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం బీసీల సంఖ్య 6 శాతం తగ్గింది. దీనిపై ఎందుకు రివ్యూ చేయలేదు. ముగ్గురు పాల్గొనకపోతే 6 శాతం తగ్గుతదా..? మేం పాల్గొనంతా మాత్రాన 6 శాతం తగ్గదు. బలహీన వర్గాలకు చిత్తశుద్ధితో రిజర్వేషన్లు అమలు చేయాలి. రాహుల్ ప్రధాని అయితేనే చేస్తామని చెప్పి ఉండేది. బీసీ సబ్ ప్లాన్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. పదవులతో రాజకీయంగా న్యాయం జరగదు. సామాజికంగా, ఆర్థికంగా కూడా న్యాయం జరగాలని కేటీఆర్ పేర్కొన్నారు.