BRS MLA Kaushik Reddy | బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు గురువారం రాత్రి ఉస్మానియా దవాఖానకు తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కౌశిక్ రెడ్డిని న్యాయమూర్తి ఎదుట హాజరు పరుస్తారు.
బుధవారం బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో సిబ్బంది విధులకు ఆటంకం కలిగించారని కౌశిక్ రెడ్డిపై సీఐ రాఘవేంద్ర ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుతో కౌశిక్ రెడ్డితోపాటు 20 మంది ఆయన అనుచరులపై కేసు నమోదు చేశారు. గురువారం ఉదయం కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.