4 కాదు 12 రోజులు సభ పెట్టాలి
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 12 రోజులపాటు నిర్వహించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కో రారు. బీఏసీ మీటింగ్‌లో సభను 4 రోజులే నిర్వహిస్తామని చెప్పడం ఆశ్చర్యానికి గురిచేసిందని చెప్పారు.
- ఎమ్మెల్యే కడియం శ్రీహరి
హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 12 రోజులపాటు నిర్వహించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కో రారు. బీఏసీ మీటింగ్‌లో సభను 4 రోజులే నిర్వహిస్తామని చెప్పడం ఆశ్చర్యానికి గురిచేసిందని చెప్పారు. బీఏసీ సమావేశం అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. బడ్జెట్‌తోపాటు ప్ర జా సమస్యలు చర్చించేందుకు 4 రోజు లు ఎలా సరిపోతాయని ప్రశ్నించామని చెప్పారు. దీంతో 13న అవసరమైతే మరోసారి బీఏసీ సమావేశం నిర్వహిస్తామని స్పీకర్ చెప్పారని తెలిపారు.
దక్షిణ తెలంగాణ ఆందోళన: ఎమ్మెల్సీ
కేఆర్ఎంబీ విషయంలో దక్షిణ తెలంగాణ ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి పేర్కొన్నారు. ప్రసంగం ఆ సాంతం వాస్తవాల వక్రీకరణ జరిగిందని మండిపడ్డారు. కేఆర్ఎంబీ ప్రస్తావన ఎందుకు లేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఫార్మాసిటీపై అయోమయం లేదు: రంగారెడ్డి,ఆది శ్రీనివాస్
ఫార్మా సిటీ విషయంలో ప్రజలకు ఎలాంటి అయోమయం అవసరం లేద ని కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి చెప్పారు. గవర్నర్ ప్రసంగం అద్భుతం గా ఉన్నదని, అందుకే బీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారని ప్ర భుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.
బీఆర్ఎస్ భాష మార్చుకోవాలి: చంద్రూనాయక్,వంశీకృష్ణ
కాంగ్రెస్ పాలన చూసి ఓర్వలేకపోతున్న బీఆర్ఎస్ నాయకులు తక్షణమే తమ భాష మార్చుకోవాలని ఎమ్మెల్యే చంద్రూనాయక్ సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాకతో తెలంగాణకు నిజమైన స్వాతంత్య్రం వచ్చిందని ఆ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ చెప్పారు.
హరీశ్‌రావు మాటలు హాస్యాస్పదం: రామ్మోహన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి
గవర్నర్ ప్రసంగంపై మాజీ మంత్రి హరీశ్‌రావు మాట్లాడిన తీరు హాస్యాస్పదంగా ఉన్నదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రామ్మోన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి పేర్కొన్నా రు. కోదండరాంకు ఎమ్మెల్సీ పదవి ఇస్తే ఓర్వలేక పోతున్నారని విమర్శించారు.
ఎన్నికల్లో లబ్ధి కోసమే కేఆర్ఎంబీ: పాయల్‌శంకర్, హరీశ్‌బాబు
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కేఆర్ఎంబీని తెరమీదకు తెచ్చాయని బీజేపీ ఎమ్మెల్యేలు పాయల్‌శంకర్, హరీశ్‌బాబు పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RRR | రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేంద్రం బ్రేక్.. ప్రస్తుత అలైన్మెంట్తో ప్రాజెక్టుకు ఆమోదం కష్టమే!
Congenital Birth: ఒడిశాలో రెండు తలలతో పుట్టిన మగ శిశువు
Mithun Chakraborty | ‘జైలర్ 2’లో రజనీకాంత్‌కు మిథున్ చక్రవర్తి కండీషన్.. విలన్ పాత్రకు ఓకే చెప్పడానికి అదే కారణమా?
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

