MLA Jagadish Reddy | హైదరాబాద్ : నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి వారికి ఉన్న జ్ఞానానికి నా జోహార్లు అని సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్కు బద్ధ శత్రువులుగా ఉన్న వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయాలని చూస్తున్న రేవంత్ రెడ్డి, రాధాకృష్ణ ఏం మాట్లాడుతున్నారో వారు అదే మాట్లాడుతున్నారు అని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.
కవిత ఉపయోగించిన పదాలను రేవంత్ రెడ్డి, రాధాకృష్ణ ఉపయోగించారు. వాళ్ళు ఉపయోగించిన పదాలను కవిత వల్లెవేస్తున్నారు. నల్గొండ జిల్లాలో 25 ఏళ్లల్లో జరిగిన ఉద్యమాలకు, గెలుపుకు నేను భాద్యత అయితే ఓటమికి నేను భాద్యుడను. పార్టీ అంతిమంగా ఫైనల్. వ్యక్తులుగా ఏదో చేస్తామని అంటే వారి భ్రమ. కొంతమంది ఏదో చేస్తామని ఊహించుకుంటున్నారు అని జగదీశ్ రెడ్డి తెలిపారు.
నేను పార్టీకి సైనికుడిని. నేను కేసీఆర్ను ఈ మధ్య కాలంలో 50సార్లు కలిశాను. వారి గురించి చర్చ రాలేదని నేను చెప్పాను. వారి గురించి మాట్లాడటం వృధా అని చెప్పాను అంతే. కేసీఆర్తో బనకచర్ల, వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశంపైనే చర్చించాము. కేసీఆర్ లేకపోతే ఎవరం లేము. అందులో ఎలాంటి సందేహం లేదు. నేను చావుతప్పి కన్నులొట్టబోయినట్లు గెలిచిన.. కానీ కొంతమంది గెలవలేదు కదా. కవితపై తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు నా దృష్టికి రాలేదు. నేను చూడలేదు నేను చూసిఉంటే స్పందించేవాడిని అని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.