హైదరాబాద్, డిసెంబర్ 3(నమస్తే తెలంగాణ): రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాతీర్పును గౌరవిస్తామని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీశ్‌రావు పేర్కొన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి ఆదివారం ఆయన ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. రెండు పర్యాయాలు బీఆర్ఎస్కు అవకాశమిచ్చిన ప్రజలు.. ఈసారి కాంగ్రెస్‌ను ఆదరించారని చెప్పారు.
ప్రజల నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పాలన సాగాలని ఆకాంక్షించారు. ఎన్నికల సమరంలో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా రేయింబవళ్లు శ్రమించిన పార్టీ శ్రేణులకు, ఆదరించిన ప్రజలకు హరీశ్‌రావు కృతజ్ఞతలు తెలియజేశారు.