హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): మైనింగ్ తవ్వకాల్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ నమోదైన కేసులో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి మంగళవారం ఈడీ ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈడీ అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు.
మహిపాల్‌రెడ్డి, అతని సోదరుడు మధుసూదన్‌రెడ్డి ఇండ్లల్లో ఇటీవల ఈడీ అధికారులు రెండు రోజులపాటు సోదాలు చేసి రూ.300 కోట్లు ప్రభుత్వానికి నష్టం వాటిల్లేలా అక్రమ మైనింగ్, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని ఆరోపించారు. దీనిపై ఎమ్మెల్యే తమ ఎదుట హాజరుకావాలని నోటీసులు పంపగా.. ఆయన ఈడీకి వివరణ ఇచ్చుకున్నారు.