Gangula vs Ponnam | హైదరాబాద్ : మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ను అసెంబ్లీ సాక్షిగా మంత్రి పొన్నం ప్రభాకర్ బాడీ షేమింగ్ చేశారు. ఆకారంలో పెద్దగా ఉంటే అవగాహన ఎక్కువగా ఉందనుకుంటే నాకు తెల్వదు అని పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే గంగులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బీసీ రిజర్వేషన్లపై అవగాహన తనకు లేదంటే.. గంగుల కంటే ఎక్కువ చదువుకున్నా.. రాజకీయాల్లో విద్యార్థి దశ నుంచి ఉన్నా.. నాకు ఎక్కువ తెల్వదు అనుకుంటే పొరపాటు.. నేను ఏమంటున్న అంటే ఆకారంలో పెద్దగా ఉంటే అవగాహన ఎక్కువ ఉంటది అనుకుంటే పొరపాటు అని పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు.
పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పందించారు. నేను కూడా బాడీ షేమింగ్ గురించి మాట్లాడితే పెద్ద కాంట్రావర్సి అవుతది అని పేర్కొన్నారు. తాను కేవలం ఒక్కటే అడగుతున్నా.. శాస్త్రీయంగా బీసీ రిజర్వేషన్లు కల్పించండి.. రాజ్యాంగపరంగా 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నాం. అసెంబ్లీలో బిల్లు పెట్టి జీవో పాస్ చేయడానికి 20 నెలలు ఎందుకు టైమ్ వేస్ట్ చేశారు.. ఈ పని అప్పుడే చేసి, ఎన్నికలకు వెళ్ళాల్సింది అని గంగుల కమలాకర్ పేర్కొన్నారు. మార్చి 2024లో జీవో నెంబర్ 26ను బీసీ కమిషన్ ద్వారా తీసుకొచ్చారు.. ఆ తర్వాత బీసీ కమిషన్ మాయమైంది అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వ్యాఖ్యానించారు.
మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ను అసెంబ్లీ సాక్షిగా బాడీ షేమింగ్ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ pic.twitter.com/UKCeF39XF4
— Telugu Scribe (@TeluguScribe) August 31, 2025