వైరా టౌన్, అక్టోబర్ 19: ఖమ్మం జిల్లా వైరాలో గులాబీ జెండా ఎగరేలా పార్టీ కార్యకర్తలు పనిచేయాలని ఎంపీ నామా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. వైరా పట్టణంలోని 15వ వార్డులో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మదన్‌లాల్‌ను మంచి మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు సూచించారు.
బీఆర్ఎస్ పాలనలో ప్రతి ఇంటికి ఏదో ఒక సంక్షేమ పథకం అందిందని, నాయకులు సంక్షేమ పథకాలను వివరించి ఓట్లు అభ్యర్థించాలని కోరారు. రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి మాట్లాడుతూ.. వైరా ఎమ్మెల్యే రాములునాయక్.. సీఎం కేసీఆర్‌ను దేవుడిగా భావిస్తారని, ఆయన ఆజ్ఞను శిరసావహిస్తారని అన్నారు. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి బానోతు మదన్‌లాల్‌ను గెలిపించేందుకు రాములు నాయక్ నిస్వార్థంగా పనిచేస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రాములునాయక్, పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బానోతు మదన్‌లాల్ తదితరులు పాల్గొన్నారు.