హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ) : వక్ఫ్ బోర్డు సిబ్బందిపై దాడి చేసిన నిందితులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ మైనారిటీ నేతలు డిమాండ్ చేశారు. మంగళవారం సచివాలయంలో మైనారిటీ వెల్ఫేర్ సెక్రటరీకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీఎస్ఎంఎఫ్సీ మాజీ చైర్మన్ అక్బర్ హుస్సేన్, బీఆర్ఎస్ నేత వాహిద్ మాట్లాడారు.
హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): ప్రైవేట్ స్కూళ్లను అసాంఘికశక్తుల వేధింపుల నుంచి కాపాడాలని ట్రస్మా కోరింది. బోగస్ సంఘాలు, బోగస్ కార్యకర్తల భారీ నుంచి రక్షణ కల్పించాలని విజ్ఞప్తిచేసింది. మంగళవారం నాంపల్లిలో ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌ఎన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి అనిల్‌కుమార్ విలేకరులతో మాట్లాడారు.