హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ) : తాను బీజేపీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలను బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర శనివారం ఓ ప్రకటనలో ఖండించారు. బీజేపీలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ విలీనమవుతున్నట్టు వస్తున్న కథనాల్లో నిజం లేదని, అవి అభూత కల్పనలని కొట్టిపారేశారు. బీఆర్ఎస్ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు, పార్టీ ని బలహీనపర్చేందుకు నిరాధారమైన, వాస్తవ విరుద్ధమైన కథనాలను కొన్ని మీడియాసంస్థలు ప్రచా రం చేయడం విచారకరమని పేరొన్నారు. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే ముందుకు సాగుతామని స్పష్టంచేశారు.
కేటీపీపీలో విద్యుత్తు ఉత్పత్తి నిలిపివేత
గణపురం, జూలై 13: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిల్పూరులోని కాకతీయ థర్మల్ విద్యుత్తు కేంద్రంలోని మొదటి దశ 500 మెగావాట్ల ప్లాం ట్లో విద్యుత్తు ఉత్పత్తిని శుక్రవారం రాత్రి నిలిపివేశారు. జెన్కో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏటా ప్రాజెక్టులో ఓవరాలింగ్ పనులు చేపడుతా రు. ఈ నేపథ్యంలో 500 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తిని నిలిపివేసి మెయింటనెన్స్ పనులు ప్రారంభించారు. నెల రోజులపాటు ఉత్పత్తి నిలిచిపోనున్నది.