BRS Manifesto | ఎన్నికల సమరానికి సన్నద్ధమైన బీఆర్ఎస్.. పార్టీ మ్యానిఫెస్టోను విడుదల చేసింది. తెలంగాణ భవన్లో పార్టీ అధినేత కేసీఆర్ మ్యానిఫెస్టోను ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే వచ్చే ఐదేండ్లలో ప్రజల సంక్షేమం, అభివృద్ధికి బీఆర్ఎస్ ఏం చేయబోతున్నదన్న పూర్తి ప్రణాళికను వివరించారు. దళిత బంధుతో ఇప్పటివరకు బీసీల కోసం కొనసాగుతున్న పథకాలు అన్నీ కొనసాగుతాయని హామీ ఇచ్చారు. అలాగే ఆసరా పెన్షన్లు, రైతుబంధు డబ్బుల పెంపుతో పాటు మహిళల కోసం ప్రత్యేక స్కీమ్‌లను కేసీఆర్ ప్రకటించారు. రైతుబీమా తరహాలో ప్రజలందరికీ బీమా సౌకర్యం కల్పిస్తామని.. ఆరోగ్యశ్రీ గరిష్ట పరమితిని రూ.15 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చారు.
తన తాత రాఘవరావు - నాయనమ్మ వెంకటమ్మ గార్ల దివ్యాశీస్సులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నికల కదనరంగంలోకి దిగారు. తాత-నాయనమ్మల సాక్షిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేతుల మీదుగా సిరిసిల్ల అభ్యర్థిగా బీఫామ్ అందుకున్నారు.
Ktr
సీపీఎస్ నుంచి ఓపీఎస్‌కు మార్చాలని ప్రభుత్వ ఉద్యోగులు కోరుతున్నారు. ఎన్నికల వాగ్దానం కింద కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తూతూమంత్రంగా సీపీఎస్ టు ఓపీఎస్‌గా మార్చారు. కానీ అది బూమరాంగ్ అవుతుంది. కేంద్ర ప్రభుత్వం ససేమిరా అంటుంది. ఆ ఫండ్ ఇవ్వడం లేదు. అదో పీటముడిగా మారింది. అందుకే తెలంగాణ ప్రభుత్వం ఏం చేయాలి? ఆచరణాత్మక విధానం ఏది అవలంబించాలనేదానిపై సాధ్యాసాధ్యాలు స్టడీ చేయడానికి ఉన్నతాధికారుల కమిటీ నియమించి.. ఆ రిపోర్టు ఆధారంగా నిర్ణయం తీసుకుంటాం.
పట్టాదారుడు అయితే భూమిని అమ్ముకునే అవకాశం ఉంది. కొన్ని చోట్ల రాళ్లు గుట్టలు ఉన్న దగ్గర కూడా కోట్ల రూపాయల డిమాండ్ ఉంది. అటువంటి చోట భూములు అమ్ముకుంటే మరోచోట పదెకరాలు కొనుకుంటున్నారు. కానీ వీళ్లకు అలాంటి సదుపాయం లేదు. దాన్ని రిలీవ్ చేయాలని దళిత సోదరులు కోరుతున్నారు. ఈ అసైన్డ్ భూములపై కూడా పార్టీలతో సంబంధం లేకుండా దళిత ప్రజాప్రతినిధులు అందర్నీ సమావేశపరిచి ఒక పాలసీ రూపొందించి.. అసైన్డ్ భూములపై ఆంక్షలు ఎత్తివేసి.. మామూలు పట్టాదారుల్లా హక్కులు కల్పించే ప్రయత్నం బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది.
తెలంగాణ ప్రభుత్వం రెసిడెన్షియల్ విద్యకు పెద్దపీట వేస్తున్నది. ఈ విధానం సత్ఫలితాలను సాధిస్తున్నది.
• రాబోయే రోజుల్లో మరిన్ని రెసిడెన్షియల్ విద్యాలయాలను నూతనంగా ఏర్పాటు చేస్తాం.
• అగ్రవర్ణ పేదల కోసం నియోజకవర్గానికి ఒకటి చొప్పున రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తాం
46 లక్షల మంది స్వశక్తి మహిళా గ్రూపులో సభ్యులుగా ఉన్నారు. పక్కా భవనాలు లేని గ్రూపులకు ప్రభుత్వమే విడతలవారీగా భవనాలు కట్టిస్తాం.
హైదరాబాద్‌లో ఇంకా ఖాళీ ప్రదేశాలు ఉన్నాయి. ఇప్పటికే కట్టిన కాలనీల్లో కూడా మరిన్ని ఇండ్లు కట్టేందుకు ప్రదేశాలు ఉన్నాయి. వీటన్నింటినీ చూసుకుని హైదరాబాద్‌లో మరో లక్ష బెడ్రూం ఇండ్లు కట్టాలని నిర్ణయించాం. ఇండ్లు ఉన్నవారికి గృహలక్ష్మీ కొనసాగిస్తూనే.. ఇండ్ల స్థలాలు లేనివారికి జాగాలు కూడా ప్రభుత్వమే సమకూర్చాలని నిర్ణయించుకున్నాం.
ఆరోగ్య శ్రీ పరిధిని రూ.15లక్షలకు పెంచుతాం. జర్నలిస్టులకు రూ.15లక్షల వరకు ఉచిత వైద్య సేవలు. దీనికి కేసీఆర్ ఆరోగ్య రక్ష అని పార్టీ వాళ్లు పేరు పెట్టారు.
జర్నలిస్టులకు కూడా వాళ్ల ఆదాయంతో సంబంధం లేకుండా రూ.400కే గ్యాస్ సిలిండర్ అందజేస్తాం. అక్రిడేషన్ ఉన్న జర్నిలిస్టులు అందరికీ 400 కే సిలిండర్ అందజేస్తాం
అంతర్జాతీయ విపణిలో ముడిచమురు ధరలు, గ్యాస్ ధరలు తగ్గినా కేంద్ర ప్రభుత్వాలు ప్రజలపై అడ్డగోలు భారం మోపుతుంది. తెలంగాణలో చాలామంది మళ్లీ గ్యాస్ స్టవ్‌లు మానేసి కట్టెల పొయ్యిలు వాడుతున్నారు. ఈ బాధలు పోవాల్సి ఉంది. అందుకే అర్హులైన మహిళలకు రూ.400కే గ్యాస్ సిలిండర్ అందజేయాలని నిర్ణయించాం.
సౌభాగ్యలక్ష్మీ పథకం కింద బీపీఎల్ కింద ఉన్న పేద మహిళలకు రూ.3వేల గౌరవ భృతి
మొదటి సంవత్సరం రూ.12వేలకు పెంచుతాం. తర్వాత ప్రతి ఏడాది విడతలవారీగా రూ.16వేలకు పెంచుతాం
దివ్యాంగులకు 4016 పెన్షన్ పెంచుకున్నాం. దాన్ని రూ.6వేలకు తీసుకెళ్తాం. మార్చి తర్వాత రూ.5వేలు చేసి.. ప్రతి సంవత్సరం 300కి పెంచుతూ ఆరు వేలకు తీసుకెళ్తాం.
పదులు, వందల్లో ఉన్న పెన్షన్లలో ఉన్న స్కీంను వెయ్యిల్లోకి తీసుకెళ్లిన మొట్టమొదటి ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమేనని సీఎం కేసీఆర్ అన్నారు. వెయ్యి రూపాయలతో మొదలుపెట్టి.. ఆర్థిక సౌష్టవం పెరిగిన తర్వాత 2016 చేసుకున్నాం. ఆర్థిక పరిస్థితి పెరుగుతున్న కొద్దీ పెన్షన్లను పెంచుకుంటూ పోయాం. ఇప్పుడు 5 వేలకు పెంచాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ రూ.5వేలను వెంటనే ఇవ్వం. మార్చి తర్వాత పెన్షన్‌ను రూ.3వేలు చేస్తాం. ప్రతి సంవత్సరం 500 పెంచుతూ ఐదో సంవత్సరం నిండేనాటికి రూ.5వేలకు తీసుకెళ్తాం. దీనివల్ల ప్రభుత్వంపై ఒకేసారి భారం పడదు.
దీంతో పాటు రాష్ట్రంలో ఇంకో స్కీం తేవాలని నిర్ణయించాం. తెలంగాణలో ఆకలి పోయింది. హాస్టల్స్‌లో పిల్లలకు సన్నబియ్యం, అంగన్వాడీలో కూడా అందిస్తున్నాం. అన్నపూర్ణగా తయారైన రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి కూడా సన్నబియ్యం ఇవ్వాలని నిర్ణయించాం. ప్రతి రేషన్ కార్డు హోల్డర్‌కు వచ్చే ఏప్రిల్, మే నుంచి సన్నబియ్యం ఇస్తాం. ఇక దొడ్డుబియ్యం బాధ ఉండదు. ఈ స్కీంకు తెలంగాణ అన్నపూర్ణ అని పేరు పెడుతున్నాం. ప్రభుత్వంలోకి రాగానే ఇంప్లీమెంట్ చేస్తాం.
తెలంగాణ రాష్ట్రంలోని సుమారు 1.10 లక్షల కుటుంబాలకు 93 లక్షల పైచిలుకు రేషన్ కార్డులు ఇచ్చాం. వందకు వంద శాతం ప్రీమియం చెల్లించి రైతుబీమా తరహాలో ఈ కుటుంబాలు అన్నింటికీ కేసీఆర్ బీమా- ప్రతి ఇంటికీ ధీమా అనే పద్ధతిలో బీమా సదుపాయాన్ని కల్పించాలని నిర్ణయించాం. ఎల్ఐసీ ద్వారానే ఈ బీమా కల్పించనున్నాం. 93 లక్షల కుటుంబాలకు బీమా సదుపాయం కల్పించేందుకు ఒక్కో కుటుంబానికి రూ.3600 నుంచి రూ.4వేలు ఖర్చయ్యే అవకాశం ఉంది. అయినా సరే దీన్ని తీసుకోవాలని పార్టీ నిర్ణయించింది. ప్రభుత్వం వచ్చిన తెల్లారి నుంచి నాలుగైదు నెలల్లో దీన్ని అమలు చేస్తాం. జూన్ నెల నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది.
మైనార్టీల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుంది. మైనారిటీలకు మరిన్ని అవకాశాలు కల్పిస్తాం. మైనారిటీ జూనియర్ కాలేజీలను డిగ్రీ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేస్తాం.
దళితబంధు పథకాన్ని కొనసాగిస్తాం : సీఎం కేసీఆర్
తెలంగాణలో మతసామరస్యం కొనసాగుతోంది. గత పదేండ్లలో ఎలాంటి గొడవలు జరగలేవు : సీఎం కేసీఆర్
ఎన్నికల ప్రణాళికలో చెప్పింది 10 శాతమే కానీ అమలు చేసింది 90 శాతం.
జనగామ అభ్యర్థిగా కేసీఆర్ చేతుల మీదుగా బీఫామ్ అందుకున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి
Palla
సీఎం కేసీఆర్ తరఫున కామారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన బీఫామ్‌ను గంప గోవర్దన్ అందుకున్నారు. అలాగే మాతృవియోగం కారణంగా కార్యక్రమానికి దూరంగా ఉన్న వేముల ప్రశాంత్‌రెడ్డి తరఫున ఎమ్మెల్సీ కవిత బీఫామ్ తీసుకున్నారు.
Kavitha
శ్రీనివాస్ గౌడ్, వనమా వెంకటేశ్వర్ రావు, కృష్ణ మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టారు. గెలవలేక కోర్టుల్లో కేసులు వేసి ఇబ్బంది పెట్టారు. సాంకేతికంగా కారణాలు చూపి, ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. మనకు మంచి న్యాయకోవిదులు ఉన్నారు. మీకు గైడ్ చేయడానికి న్యాయవాదులు అందుబాటులో ఉంటారు. వారితో మాట్లాడి, తెలియని విషయాలు తెలుసుకోవాలి. ఎన్నికలు వచ్చినప్పుడల్లా తమాషాలు చూస్తుంటాం. ఈ ఎన్నికల్లో నిబంధనలు మారుస్తుంటారు. ప్రతిది తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మాకు తెలుసులే అని అనుకోవద్దు. 98480 23175 నంబర్‌కు ఫోన్ చేస్తే భరత్ కుమార్ 24 గంటలు అందుబాటులో ఉంటారు. మన పార్టీకి, ఎన్నికల కమిషన్‌కు మధ్య వారధిగా భరత్ కుమార్ పని చేస్తున్నారు.అభ్యర్థులకు సందేహాలు వస్తే ఒక్క ఫోన్ కొడితే నిమిషాల్లోనే పరిష్కారం చూపిస్తారు. పొరపాటు జరగకుండా చూసుకోవాలి. ఇప్పట్నుంచే నామినేషన్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. చివరి రోజున నామినేషన్లు వేసేందుకు ప్రయత్నించొద్దు. ఇవాళ 51 బీ-ఫారాలు తయారు చేశాం. బీ-ఫారాలు నింపేటప్పుడు.. అప్డేట్ ఓటర్ జాబితాను అనుసిరించాలి. మిగతా బీ-ఫారాలు రెడీ అవుతున్నాయి.
అభ్యర్థులకు సంస్కారం ఉండాలి. ప్రజలకు దండం పెట్టి ఓటు కావాలని అడుగుతాం. రాజకీయాలు అన్నతర్వాత మంచి, చెడు ఉంటాయి. అలకలు ఉంటాయి. అందరి కంటే ఎక్కువగా అబ్యర్థులు ప్రజల్లో ఉండాలి. కోపాలు తీసేసుకోవాలి. చిన్న కార్యకర్తతో మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఇది తప్పక పాటించాలి. గత ఎన్నికల్లో ఒకరిద్దరికి చెప్పాను. వ్యక్తిత్వం మార్చుకోవాలని చెప్పాను. మాట్లాడలేదు. ఒకరు ఓడిపోయారు. జూపల్లి కృష్ణారావు ఒకాయన ఉండే.. మంత్రిగా పని చేశారు. ఆయన అహంకారంతో ఇతర నాయకులతో మాట్లాడలేదు. ఓడిపోయారు. అలా ఉంటది. ఒక మనిషితో మాట్లాడేందుకు అహంకారం ఎందుకు..? నాయకుడికి కొన్ని లక్షణాలు ఉండాలి. నాయకుల చిలిపి పనులు, చిల్లర పనుల వల్ల ఎన్నో కోల్పోతారు. సంస్కారవంతంగా ఉండాలి. మంచిగా మాట్లాడం, ప్రవర్తించడం నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా మనవి చేస్తున్నా.. ఇది ఇంపార్టెంట్ ఘట్టం. మంచిగా మాట్లాడటం నేర్చుకోవాలి. కార్యకర్తలకు మనల్ని అడిగే అధికారం ఉంటుంది. ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ముందుకు పోవాలి అని కేసీఆర్ సూచించారు.
బీఆర్ఎస్ అభ్యర్థులకు బీ-ఫారాల అందజేత సందర్భంగా తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్.. వారిని ఉద్దేశించి మాట్లాడారు. ఈ రోజు రెండు కార్యక్రమాలు ఉన్నాయి. హుస్నాబాద్‌కు వెళ్లాల్సి ఉంది. సమయానికి అన్ని జరిగిపోయేలా ముగించుకుందాం. మీ అందరికీ చాలా సందర్భాల్లో, చాలా సమావేశాల్లో పదే పదే ఒక మాట చెప్పాను. మళ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు వస్తాయి, విజయం సాధిస్తారని ఆత్మవిశ్వాసం ప్రకటించాను. మీ అందరికీ అవకాశం రావడం సంతోషంగా ఉంది. ఎవరికైతే అవకాశం రాలేదో.. వారు తొందరపడాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్యేగా సెలెక్ట్ అవ్వడమే ఫైనల్ కాలేదు. ఎన్నో అవకాశాలు ఉంటాయని చెప్పాం. మార్చుకున్న చోట విచిత్రమైన సందర్భాలు ఉన్నాయి. వేములవాడలో మార్చుకోవాల్సిన అవసరం లేదు. న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి కాబట్టే అక్కడ అభ్యర్థిని మార్చుకోవాల్సి వచ్చింది అని కేసీఆర్ తెలిపారు.
తెలంగాణ భవన్‌లోని జయశంకర్ సార్ విగ్రహానికి సీఎం కేసీఆర్ పూలమాల వేసి నివాళులర్పించారు. అంతకుముందు తెలంగాణ తల్లి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు.
తెలంగాణ భవన్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్.. తెలంగాణ తల్లి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. కేసీఆర్‌కు పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. మరికాసేపట్లో ఎమ్మెల్యే అభ్యర్థులకు కేసీఆర్ బీ-ఫారాలు అందజేయనున్నారు. అనంతరం అభ్యర్థులతో కలిసి కేసీఆర్ భోజనం చేయనున్నారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించి, బీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రకటించనున్నారు కేసీఆర్.
కాంగ్రెస్, బీజేపీ పార్టీలు.. కులాలు, మతాల పేరిట విభజించి పాలిస్తున్నారు. ఈ దౌర్భాగ్యాపు పార్టీలను రాజకీయంగా బొంద పెడుతాం. ఐక్యతను చాటుతాం. తెలంగాణను సాధించుకున్నట్టే.. భారతదేశానికే దిశానిర్దేశం చేసే పనిలో కేసీఆర్ ఉన్నారు కాబట్టి.. అందరూ ఆశీర్వదించాలి. గ్రామాల్లో ఉన్నటువంటి అగ్రవర్ణాల రైతులు కూడా కేసీఆర్ వెంటే ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలకు కర్రుకాల్చి వాత పెట్టనున్నారు.
తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ రావడంతో రాష్ట్రం మొత్తం రాజకీయంగా హీటెక్కింది. ఆయా పార్టీలు తమ ప్రచారానికి సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్.. నేడు ఎన్నికల ప్రచారం మొదలుపెట్టనున్నారు. ప్రచారంలో భాగంగా ఈ రోజు హుస్నాబాద్‌లో నిర్వహించే బహిరంగసభలో పాల్గొననున్నారు. కాగా.. కేసీఆర్ ఎన్నికల ప్రచారం కోసం ప్రత్యేకంగా ఓ బస్సును సిద్ధం చేశారు. అధినేత చిత్రం, కారు గుర్తు, భారతదేశ పటం, గులాబీ రంగు గుభాళింపుతో ఈ బస్సు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. 2023 అసెంబ్లీ ఎన్నికల కోసం బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ బహుమతిగా ఇచ్చారు. దాంతో కొన్ని రోజుల క్రితమే ఈ బస్సు ఉత్తర ప్రదేశ్ నుంచి తెలంగాణాకు చేరింది. ఈ బస్సు నేటి నుంచి మొదలయ్యే కేసీఆర్ ప్రచార పర్వంలో తెలంగాణా రోడ్లపై పరుగులు పెట్టనుంది. అందులో భాగంగా ఈ రోజు హుస్నాబాదుకు ప్రచార రథం చేరుకోనుంది.
ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన పార్టీ అధినేత కేసీఆర్.. ఆదివారం ఉదయం తెలంగాణ భవన్లో మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే వచ్చే ఐదేండ్లలో ప్రజల సంక్షేమం, అభివృద్ధికి బీఆర్ఎస్ ఏం చేయబోతున్నదన్న పూర్తి ప్రణాళికను వివరించనున్నారు. హామీలను చెప్పడమే కాకుండా, వాటి అమలుకు తమ వద్ద ఉన్న వనరులు, అమలు విధానాలను కూడా కేసీఆర్ ప్రజలకు వెల్లడించనున్నారు. ప్రజల అవసరాలు తీర్చేలా, రాష్ట్ర ప్రగతికి ఉపయోగపడేలా మ్యానిఫెస్టో తీర్చిదిద్దిన్నట్టు బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. మ్యానిఫెస్టో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు సృష్టిస్తుందని, సకల జన సంక్షేమంగా ఉంటుందని అంటున్నాయి.
మరికాసేపట్లో విడుదల కాబోయే బీఆర్ఎస్ మేనిఫెస్టో కోసం తెలంగాణ ప్రజానీకం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశం కోసం టీవీలకు అతుక్కుపోయారు ప్రజలు. ఎందుకంటే ఆసరా పెన్షన్లు ఎంత పెంచుతారు..? రైతుబంధు, గ్యాస్ సిలిండర్ల సబ్సిడీ వంటి అంశాలపై కేసీఆర్ ఎలాంటి ప్రకటన చేయబోతున్నారనే విషయంపై ఆసక్తిగా ఉన్నారు జనాలు.
65 ఏండ్ల వయసు
45 ఏండ్ల రాజకీయ ప్రస్థానం
38 ఏండ్లుచట్టసభలకు ప్రాతినిథ్యం
22 ఏండ్లు పార్టీ అధ్యక్షుడు
13 ఏండ్ల ఉద్యమచరిత
9 ఏండ్లకుపైగా ముఖ్యమంత్రిగా..
మరికాసేపట్లో సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్‌కు చేరుకోనున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేయనున్నారు కేసీఆర్. అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థులతో కలిసి కేసీఆర్ భోజనం చేయనున్నారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించి, బీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రకటించనున్నారు. అనంతరం హుస్నాబాద్‌కు బయల్దేరి వెళ్లనున్నారు కేసీఆర్.
ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా మరికాసేపట్లో బీఆర్ఎస్ అభ్యర్థులు బీ-ఫారాలు అందజేయనున్నారు. ఈ క్రమంలో తెలంగాణ భవన్‌కు బీఆర్ఎస్ అభ్యర్థులు చేరుకుంటున్నారు. దీంతో తెలంగాణ భవన్ బీఆర్ఎస్ నాయకులతో సందడిగా మారింది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎంపీలు కూడా హాజరయ్యారు.
సీఎంగా హ్యాట్రిక్ విజయాన్ని నమోదుచేసేందుకు కేసీఆర్ చేరువలో ఉన్నారు. తెలంగాణ ప్రజల 60 ఏండ్ల చిరకాల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేసిన కేసీఆర్‌కు ప్రతిఫలంగా దక్షిణాది నుంచి హ్యాట్రిక్ సాధించిన తొలి సీఎంగా నిలిపి చిరుకానుకగా ఇవ్వలేమా? ప్రతిఒక్కరూ మనసు పెట్టి ఆలోచించాలి. ఈ సందర్భంగా చరిత్రలో ఒక ఘటనను గుర్తు చేసుకుంటే అంతకంటే స్ఫూర్తి మరొకటి ఉండదు. తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావుకు దక్షిణాది నుంచి తొలి ప్రధానిగాఅవకాశం లభించింది.
అప్పట్లో జాతీయస్థాయిలో విపక్ష కూటమి అయిన నేషనల్ ఫ్రంట్‌కు ఎన్టీఆర్ చైర్మన్‌గా ఉన్నారు. ప్రధాని హోదాలో పీవీ నరసింహరావు నంద్యాల నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచారు. దేశ ప్రధానిగా తొలిసారి ఒక దక్షిణాది వ్యక్తికి, ముఖ్యంగా తెలుగుబిడ్డకు ఈ అవకాశం దక్కడంతో ఒక తెలుగువాడిగా గర్వపడుతూ నంద్యాలలో పీవీపై టీడీపీ పోటీకి అభ్యర్థిని పెట్టడంలేదని ఎన్టీఆర్ ప్రకటించారు. తెలుగువాడిగా పీవీ పట్ల ఎన్టీఆర్కే అంత అభిమానం ఉంటే, తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిపెట్టిన కేసీఆర్ పట్ల మనకేంత అభిమానం ఉండాలి? ఇది ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన తరుణం.
తల్లి పుట్టిల్లు మేనమామకు ఎరుక అన్నట్టు, యూత్ కాంగ్రెస్ నేతగా ఉన్నప్పటి నుంచీ దాదాపు 50 ఏండ్లుగా కాంగ్రెస్ తీరును ఆయన గమనిస్తూనే ఉన్నారు. తెలంగాణ ప్రజల కష్టాలు, కన్నీళ్లు తుడిచేందుకు ఆహోరాత్రులు ఆలోచించి రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు రూపొందించి, అమలు చేసిన గొప్ప విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్. సంక్షేమం, అభివృద్ధిని సమపాళ్లలో రంగరించి తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపింది కేసీఆర్ కాదా? రాష్ట్రం ఏర్పడకముందు తెలంగాణ ఎట్లుండె? ఇప్పుడెంట్లున్నదో అర్థం కావడం లేదా? తలసరి ఆదాయంలో తెలంగాణ ఇప్పుడు దేశంలో నంబర్‌వన్ స్థానంలో నిలిచింది అంటే అది సీఎం కేసీఆర్ కృషికి, చిత్తశుద్ధికి నిదర్శనం కాదా? ఏ కోణంలో చూసినా వర్తమాన రాజకీయాల్లో కేసీఆర్‌కు సరితూగే నాయకుడు ఒక్కరంటే ఒక్కరు ఉన్నారా? తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ పట్ల ఉన్నంత అభిమానం, పాఫులారిటీ ఇంకే నాయకుడికైనా ఉన్నదా?
సీఎం కేసీఆర్ కంటే తెలంగాణను ఎక్కువగా ప్రేమించే నాయకుడు ఎవరున్నారు? కేసీఆర్ అంటే గిట్టని రాజకీయ ప్రత్యర్థులు కూడా కాదనలేని అక్షర సత్యం ఇది. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం, ప్రజలు ఎదుర్కొన్న కడగండ్లు, కన్నీళ్లు చూసి భరించలేక తన రాజకీయ భవిష్యత్తును సైతం పణంగా పెట్టి, చట్టసభల్లో పదవులను తృణప్రాయంగా త్యజించిన అరుదైన నాయకుడు కేసీఆర్. రాష్ట్ర సాధన ఒక్కటే తెలంగాణ కష్టాలకు పరిష్కారమని నమ్మి, ప్రజలను ఒప్పించి, ఉద్యమంలో భాగస్వాములను చేశారు. దాదాపు దశాబ్దన్నర కాలం అనేక కష్టనష్టాలు ఎదుర్కొని, ఎన్నో అవమానాలను భరించి ఎట్టకేలకూ తను అనుకున్న లక్ష్యాన్ని సాధించిన ధీరోదాత్తుడు. ఒక ప్రాంత ప్రజల విముక్తి కోసం అలుపెరగని పోరాటం చేసి నిలిచి గెలిచిన కేసీఆర్ స్ట్రేచర్కు సరితూగే రాజకీయ నేత ఇంకేపార్టీల్లో అయినా ఉన్నారా? తెలంగాణకు అదిచేస్తాం.. ఇది చేస్తాం అంటూ కల్లబొల్లి కబుర్లు చెప్తున్న కాంగ్రెస్ పార్టీ గురించి కూడా కేసీఆర్‌కు తెలిసినంతగా ఎవరికీ తెలియదు.
ప్రధాని మోదీ మొదలుకొని, వివిధ రాష్ర్టాల సీఎంలలో ఎవరికీ లేని ఒక అరుదైన ఖ్యాతిని కేసీఆర్ సొంతం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ఒక ఉద్యమ పార్టీని స్థాపించి రాష్ర్టాన్ని సాధించిన చరిత్ర సమకాలీన నేతల్లో ఎవరికీ లేదు. కేసీఆర్ రాష్ర్టాన్ని సాధించడం వరకే పరిమితం కాలేదు. సాధించిన రాష్ర్టాన్ని దేశంలోనే ఒక రోల్‌మాడల్‌గా తీర్చిదిద్దారు. దేశ రాజధాని ఢిల్లీలో గతంలో దక్షిణాదివారిని మద్రాసీలు అని పిలిచేవారు. ఆ తర్వాత దివంగత ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటాక ఆంధ్రవాలే అనేవారు. ఇప్పుడు కేసీఆర్వల్ల తెలంగాణే వాలే అంటున్నారు. ఇది కేసీఆర్‌కు దేశవ్యాప్తంగా ఉన్న గుర్తింపునకు నిదర్శనం. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత సీఎం కేసీఆర్ ఇక్కడ అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు దేశానికి రోల్‌మాడల్‌గా మారాయి. తెలంగాణ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డులు, రివార్డులే ఇందుకు నిదర్శనం. ప్రధాని మోదీ స్వయంగా పలు సందర్భాల్లో బీజేపీ పాలిత రాష్ర్టాలను తెలంగాణకు వెళ్లి ఇక్కడి పథకాలను అధ్యయనం చేసి రావాలని సూచించారు.
2014, 2018లో బీఆర్ఎస్ మేనిఫెస్టోలను చూశాం. మేనిఫెస్టోలో చెప్పినవే కాకుండా.. చెప్పనవి కాకుండా చేశారు సీఎం కేసీఆర్. ఎందుకంటే కేసీఆర్ అభివృద్ధి చేశారు. తెలంగాణ మోడల్‌ను ఇతర రాష్ట్రాలకు చూపించారు. తెలంగాణ అవార్డుల రాష్ట్రంగా మారింది. ప్రజలకు అనుగుణంగా మేనిఫెస్టో ఉండబోతుంది. దళితులను, మైనార్టీలను ఎవరూ పట్టించుకోలేదు. దళితుల కోసం దళితబంధు తీసుకొచ్చారు. మనలాంటి సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాల్లో లేవు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అన్ని కుంభకోణాలే.
2014 జూన్ 2న తొలిసారి సీఎంగా పగ్గాలు చేపట్టిన కేసీఆర్.. నేటికి అంటే 15-10-2023 నాటికి ఏకబిగిన 9 ఏండ్ల 134 రోజులుగా సీఎంగా కొనసాగుతున్నారు. అవాంతరాలు లేకుండా ఇంత సుదీర్ఘంగా సీఎంగా కొనసాగిన తెలుగు నేత మరెవరూ లేరు.