హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): 29న దీక్షాదివస్‌ను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ ఏర్పాట్లు చేస్తున్నది. మంగళవారం పలు జిల్లాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించింది. సిరిసిల్లలో జరిగిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. కేసీఆర్ మహావృక్షమని.. అజ్ఞానులు చెరపలేని ఆనవాళ్లు ఆయనవి అని చెప్పారు. దీక్షాదివస్‌ను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
వేల మందితో దీక్షాదివస్: ఆనంద్
వికారాబాద్, నవంబర్ 26, (నమస్తే తెలంగాణ): జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో దీక్షాదివస్ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ ఆధ్వర్యంలో సన్నాహాక సమావేశాన్ని నిర్వహించారు. 29న వికారాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించనున్న దీక్షాదివస్ఖ/ అందరూ హాజరు కావాలని కోరారు. ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్, బీఆర్ఎస్ నాయకుడు శ్రీశైల్‌రెడ్డి పాల్గొన్నారు.
తిరగబడే రోజులొచ్చాయి: గువ్వల
నాగర్‌కర్నూల్, నవంబర్ 26: కాంగ్రెస్ సర్కారుపై ప్రజలు తిరగబడే రోజులు వచ్చాయని బీఆర్ఎస్ నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాగర్‌కర్నూల్ కార్యాలయంలో మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే, దీక్షాదివస్ ఇన్చార్జి విజయసింహారెడ్డి, కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డితో కలిసి మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే బీరం మాట్లాడుతూ ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
తెగింపు కార్యకర్తలే మా బలం ;దీక్షాదివస్ గద్వాల జిల్లా ఇన్చార్జి కర్నె ప్రభాకర్
గద్వాల, నవంబర్ 26: బీఆర్ఎస్కు తెగింపు ఉన్న కార్యకర్తలే బలమని మాజీ ఎమ్మెల్సీ, దీక్షాదివస్ జోగుళాంబ గద్వాల జిల్లా ఇన్చార్జి కర్నె ప్రభాకర్ పేర్కొన్నారు. మంగళవారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, శాట్ మాజీ చైర్మన్ ఆంజనేయగౌడ్తో కలిసి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. 2009లో కేసీఆర్ దీక్ష చేపట్టడంతో ఢిల్లీ కండ్లు తెరిచి రాష్ట్రం ప్రకటించిందన్నారు. విజయసూచకంగా 29న దీక్షాదివస్ చేపడుతున్నామన్నారు.
దీక్షా దివస్.. చరిత్రలో నిలుస్తది: బాల్క
సీసీసీ నస్పూర్, నవంబర్ 26 : చరిత్రలో నిలిచిపోయే శుభదినం దీక్షా దివస్ అని మాజీ విప్, బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్, దీక్షా దివస్ జిల్లా ఇన్చార్జి తుల ఉమ అన్నారు. మంగళవారం నస్పూర్‌లోని మంచిర్యాల జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ మలి దశ ఉద్యమాన్ని ములుపు తిప్పి, ఉద్యమ చరిత్రపై చెరిగిపోని సంతకం చేసిన మహానాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య పాల్గొన్నారు.