యాదాద్రి భువనగిరి : తెలంగాణ లో కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యాన్ని నిరసిస్తూ యాదాద్రి జిల్లా రాజాపేట, ఆత్మకూరు (ఎం) మండలాల్లో సబ్ స్టేషన్ల ఎదుట బీఆర్ఎస్ నాయకుల ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతు బీమా, రైతుబంధు, యధావిధిగా కొనసాగించాలని కోరుతూ ఆలేరు బీఆర్ ఎస్ పట్టణ అధ్యక్షులు పుట్ట మల్లేష్ ఆధ్వర్యంలో ఏ డీఏ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అలవి కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన హామీలను మర్చి ప్రజలను మోసం చేసిందన్నారు. ఆరు గ్యారంటీల పేరుతో నిలువునా మోసం చేశారని విమర్శించారు. యూరియా యాప్ తో రైతుల కష్టాలు రెట్టింపయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు బీఆర్ ఎస్ తరఫున ఉద్యమిస్తామన్నారు.