హైదరాబాద్ : అసెంబ్లీ లోపలికి పోనీయకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేను అక్రమంగా అరెస్ట్ చేడాన్ని నిరసిస్తూ సూర్యాపేట నేషనల్ హైవేపై బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హైవేను దిగ్బంధంనం చేశారు. సూర్యాపేట అంజనాపురి చౌరస్తా నేషనల్ హైవేపై బీఆర్ఎస్ రాస్తారోకో.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకు డ్రామాలాడుతోందని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులను అసెంబ్లీకి రానీయకుండా అడ్డుకున్నంత మాత్రాన ఆగిపోరని ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ అసమర్ద పాలనను ఎండగడుతామన్నారు.
అసెంబ్లీ లోపలికి పోనీయకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేను అక్రమంగా అరెస్ట్ చేయడంపై నిరసనగా సూర్యాపేట నేషనల్ హైవేపై రాస్తారోకో
అసెంబ్లీకి పోనీయకుండా ఎమ్మెల్యేను అడ్డుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హైవే దిగ్బంధం
సూర్యాపేట అంజనాపురి చౌరస్తా నేషనల్… https://t.co/zHd2zxHm06 pic.twitter.com/RvdcwX8U0x
— Telugu Scribe (@TeluguScribe) September 7, 2026