గద్వాల : నేడు సీఎం రేవంత్ రెడ్డి గద్వాల నియోజకవర్గం పర్యటన సందర్భంగా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి బాసు హనుమంతు నాయుడుతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అర్ధరాత్రి నుంచే హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా హనుమంతు నాయుడు మాట్లాడుతూ…
ప్రజా పాలనలో పోలీస్ల పహారాలు, నిర్బంధాలు ఎందుకు అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.? ప్రజా ప్రభుత్వం అంటూ బీఆరాలు పలుకుతూ ప్రతిపక్ష నాయకులపై ఈ అంక్షలు ఏంటని అని నిలదీశారు.
మూడు సంవత్సరాల పాలనకే ఇంత అభద్రతాభావమా.. ఇంతటి అరాచకమా? అని మండిపడ్డారు.
తమకు కొట్లాడటం కొత్తకాదని తెలిపారు. కేవలం పెండింగ్ ప్రాజెక్టులపై సూచనలను ప్రజల కోణంలో విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి సహా కేబినెట్, ఎంపీలు, ఎమ్మెల్యేలు విహార యాత్ర కోసం ఎగవేసుకుని వస్తున్నారని.. అయినప్పటికీ గద్వాలకు సీఎం వస్తున్నాడన్న వాతావరణమే ఎక్కడా కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. అవిధంగా నియోజకవర్గంలో ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నాగర్ దొడ్డి వెంకట్ రాములు, కురువపల్లయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ బీఎస్.కేశవ్ ని అరెస్టు చేయడంపై ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకుల అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.