BRS Leaders Arrest | గద్వాల జిల్లాలో సీఎం పర్యటన..బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్
BRS Leaders Arrest | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం గద్వాల జిల్లాలో పర్యటన సందర్భంగా పోలీసులు బీఆర్ఎస్ నాయకులను ముందస్తుగా హౌస్ అరెస్టు చేశారు
జోగులాంబ గద్వాల : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy ) గురువారం గద్వాల జిల్లాలో పర్యటన సందర్భంగా పోలీసులు బీఆర్ఎస్ నాయకుల ( BRS Leaders ) ను ముందస్తుగా హౌస్ అరెస్టు( Arrest ) చేశారు
గద్వాల నియోజకవర్గ నాయకుడు బాసు హనుమంతు నాయుడును పోలీసులు అర్ధరాత్రి నుంచి హౌస్ అరెస్ట్ చేశారు. అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకులు నాగర్ దొడ్డి వెంకట్ రాములు, కురువపల్లయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ బీఎస్.కేశవ్ను అరెస్టు చేయడం పట్ల హనుమంతు నాయుడు మండిపడ్డారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా పాలనలో పోలీస్ల పహారాలు, నిర్బంధాలు ఎందుకని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. ప్రజా ప్రభుత్వం అంటూ బీరాలు పలుకుతూ ప్రతిపక్ష నాయకులపై అంక్షలు ఎందుకని నిలదీశారు. మూడు సంవత్సరాల పాలనకే ఇంత అభద్రతాభావమా.. ఇంతటి అరాచకమా? అని మండిపడ్డారు.
పెండింగ్ ప్రాజెక్టులపై ప్రతిపక్ష పార్టీల సూచనలను, ప్రజల ఆలోచనలను పరిగణనలోకి తీసుకోకుండా హడావుడిగా ప్రాజెక్టుల సందర్శన చేపట్టడం విచారకరమని అన్నారు. బీఆర్ఎస్ నాయకుల అరెస్టును తీవ్రంగా ఖండించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

