కేటీఆర్ టీ స్టాల్‌కు ఏడాది.. వార్షిక వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు
సిరిసిల్ల అభివృద్ధిలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆనవాళ్లు లేకుండా చేయాలన్న అక్కసుతో కాంగ్రెస్ సర్కార్ కేటీఆర్ ఫొటోతో ఉన్న ఓ టీ స్టాల్‌ను ఏడాది క్రితం తొలగించింది. మున్సిపల్ వాహనంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన బత్తుల శ్రీనివాస్ హోటల్ సామగ్రిని తీసుకెళ్లింది.
- నాడు రామన్న ఫొటో ఉందని సిరిసిల్లలో హోటల్ తొలగింపు
- బాసటగా నిలిచిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- సొంత డబ్బులతో గాంధీ చౌరస్తాలో టీస్టాల్ ఏర్పాటు
సిరిసిల్ల టౌన్, మార్చి 23: సిరిసిల్ల అభివృద్ధిలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆనవాళ్లు లేకుండా చేయాలన్న అక్కసుతో కాంగ్రెస్ సర్కార్ కేటీఆర్ ఫొటోతో ఉన్న ఓ టీ స్టాల్‌ను ఏడాది క్రితం తొలగించింది. మున్సిపల్ వాహనంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన బత్తుల శ్రీనివాస్ హోటల్ సామగ్రిని తీసుకెళ్లింది. బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బాసటగా నిలిచారు. సొంత డబ్బులతో సిరిసిల్ల పట్టణంలోని గాంధీచౌరస్తాలో నిరుడు మార్చి 23న కేటీఆర్ టీ స్టాల్‌ను ప్రారంభించి శ్రీనివాస్‌కు మనోధైర్యాన్ని అందించారు.
టీ స్టాల్ ఏర్పాటు చేసి ఏడాది పూర్తి కావడంతో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, రాష్ట్ర నాయకుడు చీటి నర్సింగరావు, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, నాయకుడు బొల్లి రామ్మోహన్ ఆధ్వర్యంలో టీ స్టాల్ వద్ద కేక్ కట్ చేసి పటాకులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. మున్సిపల్ వైస్ చైర్మ న్ సందీప్, విప్ మల్లికార్జున్‌గౌడ్, శంకరయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్‌పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

