హైదరాబాద్ : బీఎల్వోలు రాష్ట్ర వ్యాప్తంగా సక్రమంగా పని చేయటం లేదని, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఆరోపించారు. సోమవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డిని వినోద్ కుమార్తో పాటు బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్సీ ఎల్. రమణ, సోమా భరత్, కర్నె ప్రభాకర్, వై సతీష్ రెడ్డి, సుమిత్రానంద్ కలిశారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ.. ఎస్.ఐ.ఆర్(SIR) ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున సీఈవోకు వినపతి పత్రం అందించామన్నారు. సర్ కోసం బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రత్యేక కమిటీ వేసింది.
ఈ కమిటీ బీఎల్వోలు, బీఎల్ఏలతో కలిసి పనిచేయటం కోసం వీళ్లని నియమించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా వినతులు మాకు వచ్చాయి. అవన్నీ సీఈవో సుదర్శన్ రెడ్డికి అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఎన్యూమరేషన్ ఫామ్ ఓటర్లకు ఇవ్వడం లేదు. చాలా మందికి ఇంకా ఫామ్ అందలేదన్నారు. 20 రోజుల సమయం మాత్రమే ఉంది. ఇంకా సమయం పెంచాలని సీఈవోను కోరినట్లు ఆయన వివరించారు.
అలాగే కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఈ విషయాలు వెల్లడిస్తామని చెప్పారు.డూప్లికేట్ ఓట్లు విషయంలో సరైన చర్యలు తీసుకోవాలని కోరాం. ఇక్కడ అక్కడ రెండు ఓట్లు ఉన్నాయి. అలాంటి వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి చర్యలు తీసుకోలన్నారు. దీనిపై అవగాహన కల్పించాలి అని సూచించారు. అలాగే పేర్ల విషయంలో గందరగోళం ఉంది. వీటిపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలని, బీఎల్వోలకు తగిన సూచనలు చేయాలన్నారు.
LIVE: తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులుhttps://t.co/8eZUaimYSn
— BRS Party (@BRSparty) July 6, 2026