మానకొండూర్, అక్టోబర్ 17: మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌పై మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అసత్య ఆరోపణలు చేయడంపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. కరీంనగర్ జిల్లా మానకొండూర్ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తాళ్లపెల్లి శేఖర్‌గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం మానకొండూర్‌లోని పల్లెమీద చౌరస్తా వద్ద కరీంనగర్ -వరంగల్ రహదారిపై ఎమ్మెల్యే కవ్వంపల్లి దిష్టిబొమ్మను నాయకులు దహనం చేశారు. ఈ సందర్భంగా శేఖర్‌గౌడ్ మాట్లాడుతూ ఇటీవల మాజీ ఎమ్మెల్యే రసమయి మాట్లాడిన మాటలను వక్రీకరించి కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కవ్వంపల్లి ఇచ్చిన హామీలను అమలు చేయక రాజకీయ లబ్ధికోసం నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.