Harish Rao | హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ) / ఖైరతాబాద్, డిసెంబర్ 3 : మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు తన ఫోన్ ట్యాప్ చేయించారని బాచుపల్లిలోని నిజాంపేట ప్రగతినగర్‌కు చెందిన కాంగ్రెస్ నాయకుడు, పార్టీ సిద్ధిపేట ఇన్చార్జి గదగోని చక్రధర్‌గౌడ్ చేసిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చక్రధర్‌గౌడ్‌పై గతంలో పలు కేసులు నమోదయ్యాయి. అదే క్రమంలో తన ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, అప్పటి నుంచి తన ఫోన్‌ను హ్యాక్ చేశారని ఫిర్యాదులో చక్రధర్‌గౌడ్ ఆరోపించారు. ఆ తర్వాత తనకు, తన కుటుంబ సభ్యులకు బెదిరింపు కాల్స్ వచ్చాయని, దీని వెనుక హరీశ్‌రావు, అప్పటి టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావు ఉన్నారని, ఈ మేరకు వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
సిద్దిపేట కాంగ్రెస్ ఇన్చార్జి చక్రధర్ గౌడ్ దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టించడంపై సిద్దిపేట ప్రజలు చక్రధర్‌గౌడ్‌పై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కొందరు బాధితులు ఆయన అక్రమాల చిట్టా విప్పేందుకు సిద్ధమవుతుండగా.. ఇప్పటికే ఆయన బారినపడి అన్యాయానికి గురైన వారు కేసులు పెట్టేందుకు సంసిద్ధులయ్యారు. చక్రధర్‌గౌడ్ చరిత్ర మొత్తం నేరాలమయమేనని పలువురు స్పష్టంచేస్తున్నారు. ఈమేరకు ఆయనపై గతంలో నమోదైన కేసుల చిట్టాను బహిర్గతం చేశారు. ‘చెల్లి’ అంటూనే స్నేహితుడి భార్యపై చక్రధర్‌గౌడ్ కన్నేసినట్టు గతంలోనే బాధితురాలు ఆవేదన వ్యక్తంచేశారు. తనకు ఇల్లు ఇస్తానని నమ్మబలికి, బాగా చూసుకుంటానని వంచించి ఆ మహిళపై అఘాయిత్యానికి పాల్పడినట్టు సోషల్ మీడియాలో బాధితురాలు కన్నీటి పర్యంతమైన వీడియో చక్కర్లు కొడుతున్నది. ‘వద్దు అన్నా’ అంటూ వేడుకున్నా కూడా చక్రధర్‌గౌడ్ బలవంతం చేసినట్టు బోరున విలపించింది. దీంతో మనస్తాపానికి గురై తాను ఆత్మహత్యాయత్నం చేసినట్టు చెప్తున్నది. ఆమె ఒక్కతే కాదని, మహిళలను వేధించి, లోబర్చుకోవడంలో చక్రధర్‌గౌడ్ దిట్ట అని సిద్దిపేటకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలే చెప్తున్నారు. ఆయనపైన పలుమార్లు నమోదైన కేసుల్లో కూడా అత్యాచార యత్నం కేసులు కూడా ఉన్నట్టు తెలిపారు.
సిద్ధిపేట కాంగ్రెస్ ఇంచార్జ్ చక్రధర్ గౌడ్ దారుణాలు
చెల్లి అంటూ స్నేహితుడి భార్యపై కన్నేసిన చక్రధర్ గౌడ్
తనకు ఇల్లు ఇస్తా.. బాగా చూసుకుంటా అంటూ మహిళపై అఘాయిత్యం
వద్దు అన్నా అంటూ వేడుకున్నా బలవంతం చేసిన చక్రధర్ గౌడ్
మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేసుకున్న మహిళ pic.twitter.com/f4Q1dRo446
— Telugu Scribe (@TeluguScribe) December 3, 2024
1) కల్తీ, నేరపూరిత కుట్ర కేసులో క్రైమ్ నంబర్ 157/2006 కింద ఐపీసీ 120-బి, 489 ఏ, బీ, సీ, డీ సెక్షన్ల కింద సిద్దిపేట టూటౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
2) చీటింగ్, సైబర్ మోసానికి సంబంధించి క్రైమ్ నం.: 198/2014 కింద 66 (సీ&డీ) ఐటీ చట్టం 2008, 420 ఐపీసీ కింద సైబరాబాద్, సైబర్ క్రైమ్ పీఎస్‌లో కేసు నమోదైంది.
3) ఉద్దేశపూర్వకంగా బాధ కలిగించడం వంటి కేసులో క్రైమ్ నం.186/2018 కింద ఐపీసీ 324 ఆర్/డబ్ల్యూ 34 కింద సైబరాబాద్‌లోని బాచుపల్లి పీఎస్‌లో కేసు నమోదైంది.
4) హౌస్ ట్రాస్పాస్, అసాల్ట్, ఔట్ స్టాండింగ్ మోడెస్టీ వంటి అభియోగాల కింద క్రైమ్ నం.141/2019లో ఐపీసీ 448, 323, 509 ఆర్/డబ్ల్యూ 34 సెక్షన్ల కింద బాచుపల్లి పీఎస్‌లో కేసు నమోదైంది.
5) ర్యాష్ డ్రైవింగ్, అంటువ్యాధి చట్టం ఉల్లంఘన కేసులో క్రైమ్ నం.217/ 2020లో ఐపీసీ 279, 188, 269, 3 ఈడీఏ, 185 ఎంవీ చట్టాల కింద సనత్‌నగర్ పోలీస్స్టేన్లో కేసు నమోదైంది.
6) అత్యాచారానికి ప్రయత్నం చేసిన కేసులో క్రైమ్ నం.49/2023లో ఐపీసీ 376, 511 సెక్షన్ల కింద శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.
7) దోపిడీ, కిడ్నాప్ ప్రయత్నం కేసులో క్రైమ్ నం.522/2023లో 392, 363 ఆర్/డబ్ల్యూ 511 & 34 ఐపీసీ సెక్షన్ల కింద రాచకొండ కమిషనరేట్‌లోని ఘట్కేసర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
8) జాయింట్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా క్రైమ్ నం: 909/2023, 908/2023లో సైబర్ నేరాలు నమోదయ్యాయి.
ఆ కేసులను టాస్ ఫోర్స్, సైబర్ క్రైమ్ పోలీసులు విచారిస్తున్నారు.
ఆ కేసులు ప్రస్తుతం నాంపల్లిలోని 12వ మెట్రోపాలిటన్ కోర్టులో ఉన్నట్టు సమాచారం.
సమైక్య పాలనలో కాంగ్రెస్ నిరంకుశత్వాన్ని ఎదిరిస్తే వందల కేసులు పెట్టినా హరీశ్‌రావు భయపడలేదు. రేవంత్‌రెడ్డీ.. ఇప్పుడు నీ తాటాకు చప్పుళ్లకు హరీశ్ బెదిరిపోరు. రెండు అక్రమ కేసులు పెట్టి భయపెట్టాలనుకుంటే అది నీ అవివేకమే. అక్రమ కేసులు పెట్టడమే మీరు గొప్పగా చెప్పుకుంటున్న ఏడో గ్యారెంటీనా? ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే ఇదేనా?
మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన రేవంత్‌రెడ్డి ఏడాది పాలన వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలకు అండగా నిలుస్తున్న హరీశ్‌రావుపై కావాలనే కేసు నమోదు చేశారు. ప్రభుత్వ కక్ష పూరిత చర్యలను ప్రజలు గమనిస్తున్నరు. తగిన సమయంలో బుద్ధి చెప్తరు. రేవంత్ సర్కార్ కేసులు, బెదిరింపులకు బీఆర్ఎస్ నాయకులు భయపడరు. ఎంత అణగదొక్కాలని చూసినా కాంగ్రెస్ వైఫల్యాలను బట్టబయలు చేస్తూనే ఉంటం.
అక్రమ కేసులు పెట్టి ప్రశ్నించే గొంతుకలను భయపెట్టాలనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం మరోటి ఉండదు. హరీశ్‌రావుపై అక్రమ కేసు పెట్టడం అప్రజాస్వామికం. మోసపూరిత హామీలతో గద్దెనెకిన రేవంత్‌రెడ్డి ఏడాది పూర్తయినా ఏమీ చేయలేదు. పాలనలో అకృత్యాలు నిత్యకృత్యమైనయ్. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే హామీల అమలుపై దృష్టి పెట్టాలి.
అబద్ధాలతో అధికారంలోకి వచ్చి న కాంగ్రెస్ విధానాలను ఎండగడుతున్నందుకు హరీశ్‌రావుపై రేవంత్‌రెడ్డి కక్షగట్టారు. పాలనలో వైఫల్యాలపై నిలదీస్తున్నందుకు, రేవంత్‌రెడ్డి ద్వంద్వ వైఖరిని బయటపెట్టినందుకు హరీశ్‌పై కావాలనే కేసు పెట్టా రు. మీరు ఎన్ని కేసులు పెట్టినా బీఆర్ఎస్లో బెదిరిపోయే వాళ్లు లేరు.
తప్పులను కప్పిపుచ్చుకొనేందుకే హరీశ్‌రావుపై కాంగ్రెస్ సర్కార్ అక్రమ కేసులు బనాయించింది, ప్రశ్నించే గొంతుకలను అణచివేయాలని చూస్తున్నది. రేవంత్ సర్కారు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ప్రజ ల పక్షాన కొట్లాడుతూనే ఉంటం. ఏ ఎండ కు ఆ గొడుగు పట్టే రేవంత్‌రెడ్డి రెండు నాల్క ల ధోరణిని హరీశ్ ప్రజలముందు ఉంచినందుకే ఆయనపై అక్రమ కేసు పెట్టిండ్రు.
హరీశ్‌పై అక్రమ కేసు పెట్టడం రేవంత్‌రెడ్డి నిరంకుశ వైఖరికి నిదర్శనం. ప్రజల పక్షాన నిలబడి, ప్రశ్నిస్తున్న గొంతును నొక్కే ప్రయత్నం చేయడం దుర్మార్గం. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి అదే ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతున్నారు. రేవంత్‌రెడ్డి నిరంకుశ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నం.
కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తిచూపుతున్న హరీశ్‌రావును ఎదుర్కోలేకనే అక్రమ కేసులు పెడుతున్నరు. రేవంత్‌రెడ్డి రెండు నాల్కల ధోరణిని ఎండగడుతుంటే భయపడి కేసులు బనాయిస్తున్నరు. ఇది రేవంత్‌రెడ్డి పిరికి పంద చర్య. ఆయన ఉడత బెదిరింపులకు భయపడేవాళ్లు బీఆర్ఎస్లో ఎవరూ లేరు. ఎన్ని కేసులు పెట్టినా ప్రశ్నిస్తూనే ఉంటం.
అసమర్థ పాలనపై ప్రశ్నిస్తున్న హరీశ్‌రావును రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేకనే రేవంత్‌రెడ్డి అక్రమ కేసులు పెడుతున్నడు. సవాళ్లు విసురుతున్నడని సంకెళ్లు వేయడం, పాలనా వైఫల్యాలను కడిగిపారేస్తున్నడని కారాగారంలో పెడదామనుకోవడం, జనాల ముందు తప్పులను ఎండగడుతున్నాడని జైలులో వేయాలనుకోవడం అవివేకం. ఆయన సంకెళ్లు వేస్తే సలాం చేసే వ్యక్తి కాదు.. మీ కాంగ్రెస్ కోటలను కబళించే శక్తి.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన అసమర్థతను కప్పిపుచ్చుకొనేందుకే హరీశ్‌రావుపై, బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నడు. ఈ నియంతృత్వ, అణచివేతల పాలనలో ప్రశ్నించడమే ఘోరమైన పాపంగా మారింది. రేవంత్‌రెడ్డీ..మీ దౌర్జన్యం ప్రజాస్వామిక హక్కులనే కాదు, తెలంగాణ ఆత్మను హరిస్తున్నది. నువ్వెంత భయపెట్టినా మేం తలవంచం, మౌనంగా ఉండబోం. ప్రతిఘటిస్తూనే ఉంటం.