బోడుప్పల్, జూలై 18: డబుల్ స్మార్ట్ సినిమా పాటలో కేసీఆర్ వాయిస్ వాడినందుకు దర్శకుడు పూరి జగన్నాథ్‌పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బోడుప్పల్ బీఆర్ఎస్ నేతలు ఉప్పరి విజయ్, రాజు గురువారం మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే కేసీఆర్ వాయిస్‌ను తొలగించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా సినిమాను అడ్డుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో విజయ్, రాజు, వినయ్, మురళి, రాకేశ్ పాల్గొన్నారు.
సంగారెడ్డి సీఈగా ధర్మ
హైదరాబాద్, జూలై18 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి ఇరిగేషన్ సర్కిల్ చీఫ్ ఇంజినీర్‌గా ధర్మను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ధర్మ హైదరాబాద్ సీఈగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన స్థానంలో హైదరాబాద్ సీఈగా వరంగల్ క్వాలిటీ కంట్రోల్ సూపరింటెండెంట్ కసిరెడ్డి దేవేందర్‌రెడ్డికి పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించింది.