హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగా ణ): నిరుద్యోగుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం మొండివైఖరి వీడాలని బీఆర్ఎస్ నేతలు, కా ర్పొరేషన్ల మాజీ నేతలు డిమాండ్ చేశారు. నిరుద్యోగుల హక్కుల కోసం తన ఇంటిలో ఆమర ణ నిరాహారదీక్ష చేస్తున్న బక జడ్సన్‌ను కార్పొరేషన్ మాజీ చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, మేడే రాజీవ్‌సాగర్, గెల్లు శ్రీనివాస్‌యాదవ్, వాసుదేవరెడ్డి, బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగబాలు తదితరులు సోమవారం పరామర్శించా రు. నిరుద్యోగులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నిరుద్యోగుల నిరసన సెగతో కాంగ్రెస్ పార్టీకి కౌంట్‌డౌన్ మొదలైందని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాల ని, ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. గ్రూప్-2, 3 పోస్టుల సంఖ్యను పెంచి ప్రిపరేషన్ కోసం పరీక్షలను వాయిదా వేయాలని కోరారు. 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. బక జడ్సన్ డిమాండ్లను పరిష్కరించి, ఆయన దీక్షను విరమింపజేయాలని కోరారు. లేకుంటే ఉద్యమా లు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.