MLC Kavitha | హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): ఈడీ విచారణకు పిలిచిన ఎమ్మెల్సీ కవితకు సామాజిక మాధ్యమాల్లో ప్రజలు మద్ద తు లభించింది. ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సహా వివిధ మాధ్యమాల్లో మద్దతు వెల్లువెత్తింది. ‘కొట్లాట కొత్త కాదు.. డాటర్ ఆఫ్ ఫైటర్.. ధైర్యంగా ఈడీ విచారణకు పోయిరా కవితమ్మ’, ‘బతుకమ్మ పేర్చడం వచ్చు.. బరిలోకి దిగి కొట్లాడటం వచ్చు’, ‘కవితమ్మ ధైర్యంగా ఉండండి. మీ ధర్మ పోరాటంలో మీతోపాటు ఉన్నాం, ఉంటాం. ధర్మం మీ వైపు ఉన్నది. అంతిమ విజయం మీదే’ అని మద్దతు తెలిపారు. అటు.. కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. బీజేపీ, ఆరెస్సెస్ నాయకులు కూడా బండి వ్యాఖ్యలను తప్పుబట్టారు. పార్లమెంటు రికార్డులు ఏభాషలో ఉంటాయో, ఎలా చూస్తారో ఆ కోడి మెదడుగానికి ఎవరైనా చెప్పండి అని బండిని ఉద్దేశించి, బజ్జీల రాణీ.. ఎమ్మెల్యే సీటు కోసం బండికి భజన బాగానే చేస్తున్నా వ్.
కానీ నీవు మహిళవనే విషయాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నావు. తూతూతూ అని రాణిరుద్రమను ఉద్దేశించి విమర్శలు చేశారు. ‘తెలంగాణ బీజేపీ గెలవాలంటే ఫస్ట్ బండి సంజయ్‌ని పక్కన పెట్టాలే. ఈయన వల్ల పార్టీ ఇజ్జత్ పోతాంది. కవిత మీద అట్ల మాట్లాడటం అవసరమా? మనకు కూడా ఇంట్లో అక్కా చెల్లెండ్లు ఉన్నరు కదా. బీజేపీ సైనికుడిగా ఇదే నా ఫీలింగ్’ అని ఓ బీజేపీ కార్యకర్త, ‘ఒక ఆరెస్సెస్ కార్యకర్తగా, బీజేపీ అభిమాని గా కవిత విషయంలో బండి వ్యాఖ్యలు నన్ను బాధించాయి. నా భారతమాత సాక్షిగా నేను ఉహించిన బీజేపీ ఇది కాదు. ఈ చిల్లర రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకు న్నా’ అని ఓ ఆరెస్సెస్ కార్యకర్త స్పందించారు. ‘ఒక సీఎం కూతురిపైనే ఇట్లా మాట్లాడిండు అంటే, వీళ్లు అధికారంలోకి వస్తే మామూలు ఆడపిల్లల పరిస్థితి ఏమిటి? అని ఒక మహిళ ఫేస్బుక్లో ఆందోళన వ్యక్తం చేసింది. ట్విట్టర్లో #వీ సపోర్ట్ కవితక్క #వీ స్టాండ్ విత్ కవితక్క ట్రెండ్ అయ్యాయి.
‘బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ఎక్కడ ఉన్నవ్.. దద్దమ్మ! దమ్ముంటే తెలంగాణ పోలీసుల ముందు విచారణకు హాజరవ్వు. మధ్యాహ్న భోజనం కూడా చేయకుండా మీ అరాచక ప్రభుత్వ విచారణకు సహకరిస్తుంది మా ఆడబిడ్డ కవితక్క’; ‘బీఎల్ సంతోష్ కోర్టును అడ్డం పెట్టుకున్నడు. అదానీ మోదీని అడ్డం పెట్టుకున్నడు.. కానీ కవితక్క ధైర్యంగా విచారణకు హాజరైంది. బీఎల్ సంతోష్ పేరు బయటికి వస్తే స్టేజీల మీద ఏడ్చిన సన్నాసులు.. ఇయ్యాల ఈడీ కేసుల గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నది’ అని ధ్వజమెత్తారు.