ఎల్కతుర్తి, ఏప్రిల్ 21 : తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే కేసీఆర్ చూస్తూ ఊరుకోరని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సోమవారం ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభా ప్రాంగణంలో ఏర్పాట్లను పరిశీలించి, విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ రాష్ర్టా న్ని నంబర్ వన్‌గా తీర్చిదిద్దితే.. కాం గ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో దిగజార్చిందని విమర్శించారు. కేసీఆర్ ఏం మాట్లాడుతారోనని దేశ ప్రజలు ఆసక్తి ఎదురు చూస్తున్నట్టు వెల్లడించారు.
సక్సెస్ చేయాలి ; మాజీ విప్ గంప గోవర్ధన్
కామారెడ్డి, ఏప్రిల్ 21: ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చి విజయవంతం చేయాలని మాజీ విప్ గం ప గోవర్ధన్ పిలుపునిచ్చారు. కామారె డ్డిలో తన నివాసంలో కామారెడ్డి, రా జంపేట కార్యకర్తలతో మాట్లాడారు.
రైతుల సహకారంతోనే సభ: వొడితెల
ఎల్కతుర్తి, ఏప్రిల్ 21: ఎల్కతుర్తి, చింతలపల్లి గ్రామాల రైతుల సహకారం తోనే బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహిస్తున్నామని హుస్నాబాద్ మా జీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ వెల్లడించారు. సోమవారం సభా ప్రాంగణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాలువలు కూడుపుతున్నారని, రైతులు ఇబ్బంది పడుతున్నారని వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు చెప్పడంలో వాస్తవం లేదన్నారు.
‘కేసీఆర్ పాలనే కావాలి’
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీ సంఖ్యలో కదిలేలా ఆటో యూనియన్ నాయకు లు సమయాత్తమవుతున్నా రు. అన్ని ఆటో సంఘాలు ర్యాలీలు తీస్తున్నా యి. నాచారంలో సోమవారం ఆటో డ్రైవర్లు భారీ ర్యాలీ తీశారు. ‘కేసీఆర్ పాలనే కావాలి.. కాంగ్రెస్ పాలన పోవాలి’ అంటూ నినాదాలు చేశారు.